Team India:

Team India: గెలుపు ముంగిట టీమిండియా బొక్కబోర్లా

Team India: తొలి టీ20లో  భారీ  తేడాతో సౌతాఫ్రికానే చిత్తు చేసిన టీమిండియాకు రెండో టీ20లో పరాజయం ఎదురైంది. తొలి మ్యాచ్‌లో టీ20లో 202 పరుగులు చేసిన భారత్‌.. రెండో మ్యాచ్ లో  124 పరుగులకే పరిమితమైంది. క్లాసెన్, మార్‌క్రమ్, మిల్లర్‌ మేటి బ్యాటర్లున్న దక్షిణాఫ్రికాకు సొంతగడ్డపై ఈ లక్ష్యం ఏపాటిది అన్న అంచనాలను తారుమారు చేస్తూ .. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో విజయానికి అవకాశాలు సృష్టించుకున్న జట్టు ఆఖర్లో పట్టు విడిచి పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆదివారం దక్షిణాఫ్రికాతో రెండో టీ20లో టీమ్‌ఇండియా 3 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది.

Team India: 41 బంతుల్లో 7 ఫోర్లతో  47 పరుగులో నాటౌట్ గా నిలిచిన ట్రిస్టన్ స్టబ్స్, 9 బంతుల్లో 19 నాటౌట్ గా నిలిచిన  కొయెట్జీ పట్టుదలతో మ్యాచ్‌ దక్షిణాఫ్రికా సొంతమైంది. 125 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 19 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మొదట భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 124 పరుగులే చేసింది. ఈ మ్యాచ్ లో  గత మ్యాచ్‌ సెంచరీ వీరుడు సంజు శాంసన్  ఈసారి డకౌటయ్యాడు. ఆ మ్యాచ్‌లో టీ20లో 202 పరుగులు చేసిన భారత్‌.. 124 పరుగులకే పరిమితమైంది. క్లాసెన్, మార్‌క్రమ్, మిల్లర్‌ మేటి బ్యాటర్లున్న దక్షిణాఫ్రికాకు సొంతగడ్డపై ఈ లక్ష్యం ఏపాటిది అనుకున్నా..వరుణ్‌ చక్రవర్తి స్పిన్‌ మాయాజాలానికి సఫారీ టీమ్ విలవిలలాడింది. మంత్రించి వేస్తున్నట్లు అతను బంతుల్ని సంధిస్తుంటే.. సఫారీ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు.  16 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి  88 పరుగులతో  ఓటమి ఉచ్చులో చిక్కుకున్నట్లు కనిపించింది.  ఇక భారత్‌ విజయం లాంఛనమే అనిపించింది. కానీ ఆఖరి ఓవర్లలో టీమ్‌ఇండియా పేసర్ల పేలవ బౌలింగ్‌ పుణ్యమా అని మ్యాచ్‌ చేజారింది. మరో వికెట్‌ కోల్పోకుండా ఇంకో ఓవర్‌ మిగిలుండగానే దక్షిణాఫ్రికా మ్యచ్ ను సొంతం చేసుకుంది. 

Team India: తొలి టీ20లో భారత ఇన్నింగ్స్‌లో మెరుపులే మెరుపులు! కానీ ఈ మ్యాచ్‌లో మొత్తం తడబాటే. శుక్రవారం అద్భుత శతకంతో అదరగొట్టిన వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజు శాంసన్‌ ఈ మ్యాచ్‌లో ఖాతా తెరవకుండానే యాన్సెన్ బౌలింగ్ లో  ఔటైపోయాడు. తొలి మ్యాచ్‌లో మెరుపు ఆరంభాన్ని సద్వినియోగం చేసుకుని భారీ స్కోరు చేసిన భారత్‌ ఈసారి పేలవారంభంతో ఇన్నింగ్స్‌ అంతటా తడబడుతూనే సాగింది. పిచ్‌ నుంచి అందుతున్న సహకారాన్ని ఉపయోగించుకుని సఫారీ పేసర్లు విజృంభించడంతో భారత్‌కు ఆరంభంలోనే దెబ్బ మీద దెబ్బ తగిలింది. ఆచితూచి ఆడాల్సిన స్థితిలో కొయెట్జీ  బౌలింగ్‌లో అవసరం లేని షాట్‌ ఆడి అభిషేక్‌ 4 కే  ఔటైపోగా.. సూర్యకుమార్‌ యాదవ్ ను  సిమ్‌లానె ఎల్బీగా ఔట్ చేశాడు.

Team India: దీంతో 4 ఓవర్లకు  3 వికెట్ల నష్టానికి 15 పరుగులతో నిలిచింది. ఈ దశలో తిలక్‌ వర్మ 20 బంతుల్లో 20 పరుగులు, అక్షర్‌ పటేల్‌ 21 బంతుల్లో 27 పరుగలతో  జట్టును ఆదుకున్నారు. ఇద్దరూ క్రీజులో కుదురుకుని, వీలు చిక్కినపుడు షాట్లు ఆడడంతో స్కోరు బోర్డులో కదలిక వచ్చింది. అయితే తిలక్‌ జోరు పెంచుతున్న దశలో మిల్లర్‌ పట్టిన అద్భుత క్యాచ్‌కు వెనుదిరగక తప్పలేదు. కాసేపటికే అక్షర్‌ దురదృష్టవశాత్తూ రనౌటయ్యాడు. ఆరంభంలో ఇబ్బంది పడ్డ హార్దిక్‌ పాండ్య  తర్వాత చక్కటి షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతడి వల్లే భారత్‌ 100 దాటింది. చివరి ఓవర్లలో హార్దిక్‌ జోరు చూస్తే స్కోరు 140 దాటేలా కనిపించింది. కానీ యాన్సెన్‌ కట్టడి చేయడంతో 124 వద్దే భారత్ స్కోరు నిలిచింది. 

Team India: తొలి టీ20లో అయితే 200 పైచిలుకు లక్ష్యం. పెద్ద తేడాతో ఓడిపోయింది. ఈసారి లక్ష్యం 125 మాత్రమే కాబట్టి అలవోకగా ఛేదించేస్తుందనుకుంటే.. వరుణ్‌ దెబ్బకు వరుసగా వికెట్లు కోల్పోయిన ఆ జట్టు ఓటమి బాటలో పయనించింది. రికిల్‌టన్‌ ను 13 పరుగలకే  ఇన్నింగ్స్‌ మూడో ఓవర్లో ఔట్‌ చేసి అర్ష్‌దీప్‌ జట్టుకు శుభారంభాన్నందించగా.. ఆ తర్వాత తన కెరీర్లో ఎప్పటికీ నిలిచిపోయే స్పెల్‌తో వరుణ్‌ సఫారీలను ఉక్కిరిబిక్కిరి చేశాడు. మొదట కెప్టెన్‌ మార్‌క్రమ్‌ 3 పరుగులకు, ఆ తర్వాత రీజా హెండ్రిక్స్‌ 25 పరుగుల వద్ద  ఆడేందుకు  సాధ్యం కాని బంతులతో బౌల్డ్‌ చేసిన వరుణ్‌.. యాన్సెన్‌ ను సైతం క్రీజులో నిలవనీయలేదు.

Team India: ప్రమాదకర క్లాసెన్‌ కూడా అతడి బౌలింగ్‌లో భారీ షాట్‌ ఆడబోయి లాంగాఫ్‌లో రింకుకు దొరికిపోగా.. తర్వాతి బంతికే మిల్లర్‌ను కళ్లు చెదిరే రీతిలో బౌల్డ్‌ చేసి హ్యాట్రిక్‌ మీద నిలిచాడు. కానీ 7 పరుగులు చేసిన  సిమిలానెఅతడి హ్యాట్రిక్‌కు అడ్డు పడ్డాడు. అప్పటికే వరుణ్‌ అయిదు వికెట్ల ఘనత అందుకున్నాడు. అనంతరం సిమిలానెను బిష్ణోయ్‌ బౌల్డ్‌ చేయడంతో దక్షిణాఫ్రికా 16 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసింది. మరో ఎండ్‌లో స్టబ్స్‌ పోరాడుతున్నప్పటికీ.. పరిస్థితి భారత్‌కే అనుకూలంగా కనిపించింది. పరుగులు చేయడం చాలా కష్టంగా మారిన స్థితిలో 3 వికెట్లు చేతిలో ఉండగా చివరి 4 ఓవర్లలో దక్షిణాఫ్రికా 37 పరుగులు చేయడం కష్టమే అనిపించింది. కానీ అర్ష్‌దీప్‌ వేసిన తర్వాతి ఓవర్లో ఎదురుదాడి చేసిన కొయెట్జీ 6, 4 కొట్టడంతో మ్యాచ్‌ గమనం మారిపోయింది. అవేష్‌ వేసిన 18వ ఓవర్లోనూ అతను రెండు ఫోర్లు బాదాడు. 12 బంతుల్లో 13 పరుగులతో సమీకరణం తేలికైపోగా.. అర్ష్‌దీప్‌ వేసిన తర్వాతి ఓవర్లో స్టబ్స్‌ నాలుగు ఫోర్లు కొట్టి మ్యాచ్‌ను ముగించాడు.

Team India: ఓటమి తప్పదనుకున్న ఈ మ్యాచ్‌లో విజయానికి అవకాశాలు సృష్టించుకున్న భారత్‌  మ్యాచ్ చివరలో పట్టు విడిచి పరాజయాన్ని మూటగట్టుకుంది. స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి  17 పరుగులకే 5 వికెట్లు తీసుకుని అద్భుత బౌలింగ్‌తో భారత్‌ను గెలుపు దిశగా నడిపించినా.. 45 బంతుల్లో 39  నాటౌట్ గా హార్దిక పాండ్య విలువైన ఇన్నింగ్స్ ఆడినా..ఫలితం దక్కలేదు. ఈ ఫలితంతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ 1-1తో సమమైంది. మూడో టీ20 బుధవారం జరుగుతుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *