Gautam Gambhir

Gautam Gambhir: నెక్ట్స్ నువ్వే.. గౌతమ్ గంభీర్‌‌కు ఉగ్రవాదుల బెదిరింపులు..

Gautam Gambhir: భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న మాజీ క్రికెటర్, మాజీ లోక్‌సభ సభ్యుడు గౌతమ్ గంభీర్‌కు షాకింగ్ బెదిరింపులు ఎదురయ్యాయి. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అయిన ISIS కశ్మీర్ పేరుతో గంభీర్‌కు వరుసగా బెదిరింపు మెసేజ్‌లు వస్తున్నాయి. ఈ మెసేజ్‌లను చూసి ఒక్కసారిగా షాక్‌కు గురైన గంభీర్ వెంటనే ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు.

ఈమెయిల్ ద్వారా వచ్చిన ఈ బెదిరింపుల్లో, “నిన్ను, నీ కుటుంబాన్ని హతమారుస్తాం… నీ ఇంటిముందే బాంబు పేలుస్తాం” అంటూ స్పష్టమైన హెచ్చరికలు ఉన్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ రకమైన సందేశాలు గంభీర్‌కు మెయిల్ రూపంలో వస్తున్నాయని ఆయన పోలీసులకు తెలిపారు.

ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు వెంటనే స్పందించారు. గంభీర్ నివాసానికి బలమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆయన కుటుంబానికి ప్రత్యేక భద్రత కల్పించారు. అలాగే ఈ ఇమెయిల్‌ల మూలాన్ని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ శాఖ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ప్రాథమిక దర్యాప్తులో ఈ బెదిరింపులు విదేశాల నుంచి వచ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా పాకిస్థాన్ లేదా మిడిలీస్ట్ ప్రాంతాల నుంచి ఈ మాయ మెసేజ్‌లు వచ్చి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఇటీవలి కాలంలో గంభీర్‌కు రాజకీయాల్లోనే కాకుండా క్రికెట్ రంగంలోనూ అనేక కొత్త బాధ్యతలు వచ్చాయి. ఈ తరుణంలో ఇలా ప్రాణహానికరమైన బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా గంభీర్ అభిమానులు అతనికి మద్దతుగా నిలుస్తూ, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *