Tdp mla: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఓజీ’ సినిమా విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా మూడు భాషల్లో సెప్టెంబర్ 25న భారీ ఎత్తున విడుదల కానుంది.
🔹 టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ శుభాకాంక్షలు
ఈ నేపథ్యంలో అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ సోషల్ మీడియాలో ప్రత్యేక ప్రకటన చేశారు.
👉 “ఈరోజు విడుదల అవుతున్న పవన్ కల్యాణ్ గారి ‘ఓజీ’ సినిమాకి నా హృదయపూర్వక అభినందనలు. మంచి మనసున్న వ్యక్తి, కష్టకాలంలో మా పార్టీకి అండగా నిలిచారు. మేమూ ఆయన కోసం ఎప్పటికీ నిలబడతాం. అనంతపురంలో నేనే దగ్గరుండి సినిమా విడుదల ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతుందని చూసుకుంటా” అని తెలిపారు