Dhanunjaya Reddy

Dhanunjaya Reddy: జగన్‌ పేషీలో చక్రం తిప్పిన ధనుంజయ్‌ రెడ్డి

Dhanunjaya Reddy: గడచిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి అద్భుతమైన తీర్పు ఇచ్చారు. 164 స్థానాలు కట్టబెట్టారు. దీంతో ప్రభుత్వం పూర్తిగా ప్రక్షాళన అయిపోతుందని.. గతంలో పరిపాలనలో భాగంగా ఎవరైతే తప్పిదాలు… దారుణాలు చేశారో.. వారికి మూడడం ఖాయమని అంతా భావించారు. అయితే ఈ అంచనాలను అందుకునే విషయంలో ప్రభుత్వం తొలి నాళ్లల్లో కొంత మేర ఇబ్బందులు పడ్డా… నెమ్మదిగా గాడిలో పడింది. ఇప్పుడిప్పుడే ప్రజలు పార్టీ కేడర్ అంచనాలను అందుకునే దిశగా కూటమి సర్కార్ అడుగులు వేస్తోంది. 

అయితే ఈలోగా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొందరు బడా బాబులు… మళ్లీ తమ వ్యూహాలకు పదును పెడుతున్నట్టు సమాచారం. దీంట్లో భాగంగానే గత కొంత కాలం నుంచి మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ్ రెడ్డి యాక్టీవ్ అయ్యారనేది సెక్రటేరీయేట్‌ల్లో జరుగుతున్న చర్చ. గత ప్రభుత్వంలో సీఎం పేషీలో ఆయన చక్రం గిర్రున తిరిగింది. ఏం చేయాలన్నా.. ఆయనే చూసుకుంటారన్న రీతిలో వ్యవహరం నడిచింది. దీంతో అప్పట్లో ఆ అధికారి చెప్పనిదే ఫైలు కదిలేది కాదు.

Dhanunjaya Reddy: పెన్ను గీత కూడా పడేది కాదు. నాడు ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ సదురు రిటైర్డ్ ఐఏఎస్‌పై బహిరంగంగా విమర్శలు చేస్తే… అప్పటి అధికార పక్షంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఆ అధికారి పెత్తనంపై లోలోపలే ఉడికిపోయేవారు. ఆఫ్ ద రికార్డు సంభాషణల్లో తెగ తిట్టుకునే వారు. అధికారం కొల్పోయిన తర్వాత కొద్దిమంది మాజీలు బహిరంగంగానే సదురు రిటైర్డ్ అధికారి తీరును తప్పు పట్టారు. ఇలాంటి చరిత్ర ఉన్న సదురు రిటైర్డ్ అధికారి ఇప్పుడు యాక్టీవ్ అయ్యారనే చర్చ సెక్రటేరీయేట్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలు… అక్రమాలు.. వాటికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న విచారణలపై గుట్టుగా కూపీలాగే ప్రయత్నం చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతోందనే అంశంపైన ఆ మాజీ అధికారి ఫోకస్ పెట్టి సమాచార సేకరణ చేపడుతున్నారనే చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో కొందరు ఐఏఎస్‌లతో పాటు… సెక్రటేరీయేట్‌ల్లో తమ హయాంలో పోస్టింగులు ఇప్పించుకున్న కొందరు ఉద్యోగుల ద్వారా సమాచారాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారనేది సర్వత్రా వినిపిస్తున్న చర్చ… అంతే కాకుండా.. కొందరు ఐఏఎస్ అధికారులతో టచ్‌లో ఉంటూ అసలు విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారట.ఇక్కడితో ఆగకుండా.. కొందరు అధికారుల పోస్టింగుల విషయంలోనూ.. పరోక్షంగా ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారనేది సెక్రటేరీయేట్‌లో టాక్.

Dhanunjaya Reddy: ఈ విషయం కొందరు ఐఏఎస్ అధికారులు తమ ఇన్ సైడ్ టాక్స్‌లో చర్చించుకుంటున్నారట… ఇప్పుడు కొందరు ఐఏఎస్‌లకు సరైన పోస్టింగులు రాకపోవడం వెనుక పరోక్షంగా ఆ రిటైర్డ్ అధికారి ప్రమేయం ఉందనేది సెక్రటేరీయేట్‌ వర్గాలో జోరుగా చర్చ జరిగింది. గత ప్రభుత్వంలో అప్రాధాన్యత పోస్టింగుల్లో ఉన్నవారు.. నాన్ ఫోకల్ ఉన్న వారికి కూడా కూటమి ప్రభుత్వంలో సరైన పోస్టింగులు దక్కడం లేదనే చర్చ ఉంది. పైగా 2014-19 మధ్య కాలంలో మంచి పేరు తెచ్చుకున్న అధికారులకూ ఇప్పుడు పోస్టింగులు దక్కలేదు. పైగా రుషికొండ లాంటి నిర్మాణాల విషయంలో నాటి ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో సహకరించిన అధికారులకూ ఇప్పుడు లోకల్ పోస్టింగులే దక్కుతున్నాయి.

ఇంతే కాకుండా.. కొందరు ఐఏఎస్‌ల గురించి సోషల్ మీడియాలోనూ తప్పుడు లీకేజీలు ఇప్పించి ప్రచారం చేయించడం వెనుక ఆ మాజీ ఐఏఎస్ అధికారి పాత్ర ఉందని చర్చ సెక్రటేరీయేట్ వర్గాల్లో జరుగుతోంది. ఇలా ఇంకా బయటకు రాని వ్యవహరాలు.. బయటకు చెప్పుకోలేని అంశాలు చాలా ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఇలాంటి విషయాల్లో పూర్తిగా కాకున్నా.. పరోక్షంగానైనా.. ప్రభావింత చేసే దిశగా ఆ రిటైర్డ్ అధికారి వ్యవహరిస్తున్నారనేది సెక్రేటేరీయేట్‌ల్లో లేటెస్ట్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ పరిస్థితుల్లో ఇంటెలిజెన్స్ విభాగం కూడా అలెర్ట్ అయినట్టు తెలుస్తోంది. సదురు మాజీ ఐఏఎస్‌లతో ఎవరు టచ్ల్‌ ఉన్నారు..? ఎప్పటి నుంచి టచ్‌లో ఉంటున్నారనే దిశగా ఆరా తీస్తున్నట్టు సమాచారం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *