Crime News: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ హత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలం జంపాలవారిపాలెంలో జరిగిన దారుణ హత్య ఆ ప్రాంతంలో భయాందోళనకు దారితీసింది. తెలుగుదేశం పార్టీకి చెందిన నేత తోపూరి నరసింహాన్ని బ్రహ్మయ్య అనే వ్యక్తి దారుణంగా హత్య చేసిన బయటికి వచ్చింది.
అందిన సమాచారం ప్రకారం, తాతా హోటల్ సమీపంలో నరసింహంపై బ్రహ్మయ్య కత్తితో తీవ్రంగా దాడి చేసి హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత కూడా అతడు దారుణానికి పూని, నరసింహం మృతదేహాన్ని రెండు రోజులు ముక్కలుగా నరికి బోరుబావిలో పడేశాడు. ఈ హింసాత్మక చర్యకు సంబంధించిన వార్తలు వెలుగులోకి రావడంతో స్థానికులలో తీవ్ర ఆందోళన మొదలైంది.
బ్రహ్మయ్య గతంలో నరసింహం వద్ద నిమ్మతోటలో కాపలాదారుగా పనిచేసినట్టు సమాచారం. అయితే వీరి మధ్య ఏ వివాదం జరిగినదీ ఇంకా స్పష్టత రాలేదు. ఈ రక్తపాతం వెనక అసలైన కారణం ఏమిటో తెలియకపోవడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది.
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: 9 మంది తెలంగాణ ఉద్యమ నేతలకు కోటి రూపాయల పురస్కారం
నరసింహం కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు చర్యలకు దిగారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. ఘటనాస్థలిలో ఆధారాలను సేకరించేందుకు పోలీసులు బోరుబావి వద్ద దర్యాప్తు జరుపుతున్నారు.
ఈ దారుణ హత్య స్థానిక రాజకీయ వాతావరణాన్ని ఉలిక్కిపడేసింది. నియంత్రణ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు వెలుగు చూసే వరకు ఈ ఘటనపై ఉత్కంఠ కొనసాగుతోంది.