TATA group: అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర ప్రమాదంపై టాటా గ్రూప్ స్పందించింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబానికి రూ. కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తామని టాటా సన్స్ చైర్మన్ ఎన్టీ చంద్రశేఖరన్ ప్రకటించారు. క్షతగాత్రుల చికిత్సకు అవసరమైన వైద్య ఖర్చులను టాటా గ్రూప్ భరిస్తుందని తెలిపారు.
ఇంతటితో ఆగకుండా, ప్రమాదానికి గురైన బీజే మెడికల్ కాలేజ్ భవనాన్ని పూర్తిగా పునర్నిర్మించే బాధ్యతను కూడా టాటా గ్రూప్ చేపట్టింది. బాధితుల పట్ల తమ సహానుభూతిని వ్యక్తం చేస్తూ, వారికిచ్చే అండగా నిలవాలన్న సంకల్పంతో ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు సంస్థ తెలిపింది.
టాటా గ్రూప్ మానవీయ విలువలకు నిలువెత్తు నిదర్శనంగా ఈ చర్యలు నిలుస్తున్నాయి. సంఘటనతో దిగ్భ్రాంతికి గురైన దేశ ప్రజలకు ఇది కొంత ఉపశమనం కలిగించగలుగుతుంది.