Virat Kohli: వన్స్ కింగ్ ఆల్వేస్ కింగ్ అన్నట్లుగా ఫాంలో ఉన్నా ..పరుగులు చేయకపోయినా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా దృష్టి అంతా కింగ్ కోహ్లీ పైనే ఉంది. బిజిటిలో అత్యంత విజయవంతమైన బ్యాటర్లలో కోహ్లి ఒకడు. ప్రస్తుతం జరగనున్న ఈ సిరీస్ లో కూడా అతడు అత్యంత కీలక ప్లేయర్ గా నిలవనున్నాడు. అందుకే అతన్ని నిలువరించేందుకు.. అడ్డుకునేందుకు ఆస్ట్రేలియా జట్టు ప్రత్యేక వ్యూహాలతో రెడీ అవుతోంది.
Virat Kohli: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో అత్యంత విజయవంతమైన బ్యాటర్లలో కోహ్లి ఒకడు. ఈసారి కూడా భారత్ బ్యాటింగ్ లో అతడే కీలకం కాబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దృష్టంతా అతడిపైనే నిమగ్నమైంది. అతణ్ని ఎలా అడ్డుకోవడానికి ..పరుగులు చేయకుండా చెక్ పెట్టడానికి ఆసీస్ పేసర్లు అన్ని అస్త్రాలను ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నారు. షార్ట్‌పిచ్ బంతులతో కోహ్లి దేహాన్ని లక్ష్యం చేసుకోవాలని, దూకుడుగా బౌలింగ్ చేస్తూ అతని ఓపికను పరీక్షించాలని తప్పులు చేసేలా అతన్ని ప్రేరేపించి ఔట్ చేయాలంటూ పేసర్లకు సూచిస్తున్నాడు ఆసీస్ మాజీ వికెట్ కీపర్ ఇయాన్ హీలీ. ఆస్ట్రేలియా పేసర్లు కోహ్లీ ఫ్రంట్ ప్యాడ్లను టార్గెట్ చేసి అతన్ని బ్యాక్ ఫుట్ కు పరిమితం చేయాలంటున్నాడు.
Virat Kohli: కానీ ప్రతి బంతికీ అలా చేయొద్దు. అలా చేస్తే అలవాటు పడి పరుగుల వర్షం కురిపిస్తాడని.. ఊహించని సమయంలో అలాంటి బంతులతో అతన్ని ఊరించి ఔట్ చేయాలని చెబుతున్నాడు. ఒక వేళ ఈ వ్యూహం ఫలించకపోతే అతని దేహాన్ని లక్ష్యంగా చేసుకుని బౌన్సర్ల వేయాలని.. బంతిని తప్పించుకోవడానికి కిందికి, వెనక్కి వంగేలా చేసి అతన్ని చిరాకు పెడితే ఫలితం వస్తుందని తేల్చి పారేశాడు. కోహ్లితో ఘర్షణ పడొద్దని మరో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ సూచించాడు. అతణ్ని ఎంత రెచ్చగొడితే అంత తీవ్రతతో, అంత బాగా ఆడతాడని జాగ్రత్తలు చెబుతున్నాడు