Tamilnadu:ఈ రోజు ఎక్కువ డెలివరీ చేయాలి. ఎక్కువ నగదు క్యాష్ చేయాలి. ఎంత తొందరగా ఎక్కువ నగదు వస్తే అంత తొందరగా ఇంటికెళ్లవచ్చు. కస్టమర్లు ఎవరైతే నాకేంటి? వస్తువు ఇచ్చామా.. నగదు ఇచ్చారా? బస్.. అమ్మో త్వరగా వెళ్లి ఇంటి వద్ద ఉన్న పని చక్కబెట్టుకోవాలి.. ఇవీ ప్రతి డెలివరీ బాయ్ ఆలోచిస్తూ చేసే పని. కానీ, ఇక్కడ ఆ డెలివరీ బాయ్ మానవీయ కోణాన్ని బయటకు తీశాడు. ఆ మానవీయ కోణంతో ఓ మనిషి ప్రాణాన్నే కాపాడాడు. ఇది సరిగ్గా తమిళనాడు రాష్ట్రంలో జరిగింది.
Tamilnadu:తమిళనాడు రాష్ట్రంలో బ్లింకిట్ సంస్థకు ఓ ఎలుకల మందు ఆర్డర్ వచ్చింది. అది ఓ బాయ్‌కు దానిని చేరవేసే పని ఆ సంస్థ అప్పగించింది. ఆ బాయ్ ఎంచక్కా మూడు ప్యాకెట్లలో ఉన్న ఎలుకల మందును తీసుకెళ్లి ఆ ఇంటి గుమ్మం తట్టాడు. లోపలి నుంచి ఓ మహిళ రానే వచ్చింది. వచ్చీ రావడంతోనే ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తూ కనిపించింది. ఆమె అంతకు ముందు ఎప్పటి నుంచి ఏడుస్తూ ఉన్నదో ఏమో కానీ, మన డెలివరీ బాయ్‌లో ఉన్న మానవీయత బయటకొచ్చింది.
Tamilnadu:మరొకరైతే ఏం జేసేవారు. ఎంచక్కా ఆ ఎలుకల మందు ప్యాకెట్లు ఏడుస్తూ ఉన్న ఆ మహిళ చేతిలో పెట్టి, నగదు తీసుకొని చడీ చప్పుడు కాకుండా వెళ్లి మరో డెలివరీ ఆఫర్ కోసం ఎదురు చూసేవాడు. కానీ, ఇక్కడ ఆ డెలివరీ బాయ్ అలా చేయలేదు. వెంటనే క్యాన్సిల్ అయింది.. అంటూ ఆమెకు చెప్పేసి వెంటనే వెనుదిరిగాడు. అది ఆమెకు ఇచ్చి ఉంటే.. ఆమె బలవన్మరణానికి పాల్పడి ఉండేదేమో.. అందుకే ఆ దేవుడే ఈ డెలివరీ బాయ్ రూపంలో వచ్చాడేమో అంటున్నారు మన నెటిజన్లు.
Tamilnadu:ఇదే విషయాన్ని ఆయన ఓ వీడియోలో జరిగిన విషయాన్ని చెప్పేశాడు. దీనిపై నెటిజన్లు హర్షం వ్యక్తంచేస్తున్నారు. హ్యాట్సాప్.. అంటూ జేజేలు పలుకుతున్నారు. ఓ మహిళను కాపాడిన దేవుడా.. అంటూ కొనియాడుతున్నారు. నీలాంటి వారే ఉండాలి.. అంటూ మెచ్చుకోలు పోస్టులు పెడుతున్నారు. ఏదైతే ఏం కానీ, ఆ మహిళ కష్టాలు ఇక నుంచి అయినా తీరితే బాగుండు.. అని కూడా ఎక్కవ మంది కోరుకుంటుడటం విశేషం.
