Tamilnadu Road Accident: తమిళనాడు రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అయ్యప్ప స్వాములు దుర్మరణం పాలయ్యారు. వీరు ఐదుగురూ తెలుగు భక్తులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాకు చెందిన వారని గుర్తించారు. వీరు ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొన్న ఘటనలో ప్రమాదం చోటుచేసుకున్నది తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నది.
Tamilnadu Road Accident: తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలవగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు శబరిమల దర్శనం అనంతరం రామేశ్వరం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలిసింది. రామనాథపురం జిల్లాలోని కీళకరై ఈసీఆర్ వద్ద అయ్యప్ప భక్తులు ప్రయాణిస్తున్న కారు.. ఆగి ఉన్న మరో కారును ఢీకొట్టిందని తెలిపారు. రెండు కార్లలోనూ అయ్యప్ప భక్తులు ఉన్నారని తెలుస్తున్నది. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నది.
మృతులు వీరే..
1) వంగర రామకృష్ణ (51)-కొరప కొత్తవలస
2) మరాడ రాము (50) -కొరప కొత్తవలస
3) బండారు చంద్రరావు (35) మరుపల్లి గ్రామం, గణపతినగరం మండలం
4) మార్చిన అప్పలనాయుడు (33) -కొరప కొత్తవలస
5) మరొకరి ఆచూకీ తెలియాల్సి ఉన్నది.

