Tamilnadu:

Tamilnadu: త‌మిళ‌నాడులో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఐదుగురి దుర్మ‌ర‌ణం

Tamilnadu: త‌మిళ‌నాడు రాష్ట్రంలో మ‌హాశివ‌రాత్రి ప‌ర్వ‌దినాన బుధ‌వారం ఉద‌యం ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో ఐదుగురు వ్య‌క్తులు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. క‌రూర్ జిల్లా తిరుచ్చి జాతీయ ర‌హ‌దారిపై కారును ఓ బ‌స్సు ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు మ‌హిళ‌లు, ముగ్గురు పురుషులు చ‌నిపోయారు. మ‌రో న‌లుగురికి తీవ్ర‌గాయాలయ్యాయి. ఘ‌ట‌నా స్థ‌లానికి పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది చేరుకొని సుమారు ఐదు గంట‌ల‌పాటు శ్ర‌మించి మృత‌దేహాల‌ను వెలికితీశారు.

Tamilnadu: త‌మిళ‌నాడు క‌రూరు జిల్లా కుళిత‌లైలో హైవేపై ఎదురుగు వ‌స్తున్న ప్ర‌భుత్వ బ‌స్సును కారు ఢీకొన్న‌ది. ఈ ప్ర‌మ‌దం జ‌ర‌గ‌గానే భారీ మంట‌లు చెల‌రేగాయి, దీంతో ఆ మంట‌ల్లో కారు పూర్తికాలిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో కారులో ఉన్న ఐదుగురు చ‌నిపోయారు. ఈ ఘ‌ట‌న‌తో క‌రూర్‌-తిరుచ్చి జాతీయ ర‌హ‌దారిపై కిలోమీట‌రు మేర వాహ‌నాలు నిలిచిపోయాయి. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *