Tamil Nadu: తమిళనాడులో అజిత్ కుమార్ కస్టడీ మరణం 

Tamil Nadu: తమిళనాడులో ఆలయ భద్రతా సిబ్బంది అయిన 27 ఏళ్ల అజిత్ కుమార్ కస్టడీలో మృతిచెందిన దారుణ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. పోలీసుల అరాచకాన్ని దోషిగా నిలిపేస్తూ మద్రాస్ హైకోర్టు, హై పవర్ వ్యాఖ్యలు చేసింది. “హంతకుడైనా ఇంతటి దాడి చేయడు. ఇది రాష్ట్రమే తన పౌరుడిని చంపిన ఘటన” అంటూ న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎం. సుబ్రమణ్యం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

రాజకీయ దుమారం

ఈ ఘటనను ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. డీఎంకే పాలనపై విశ్వాసం కోల్పోయామని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

స్టాలిన్ కీలక నిర్ణయం – సీబీఐకి దర్యాప్తు

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి స్టాలిన్ కీలక ప్రకటన చేశారు. అజిత్ కుమార్ కస్టడీ మరణంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి కేసును బదిలీ చేస్తున్నట్లు తెలిపారు.

“ఇది ఎవరు సమర్థించలేని, క్షమించలేని చర్య” అంటూ వ్యాఖ్యానించిన స్టాలిన్, బాధ్యత వహిస్తూ ఐదుగురు పోలీసులను నిందితులుగా చేర్చారు. పోలీసుల చర్యను ఖండించిన ఆయన, “ఇలాంటి ఘటనలు మరెక్కడా, ఎప్పుడూ జరగకూడదు” అని అన్నారు.

హైకోర్టు ఆగ్రహం – పోస్టుమార్టం నివేదిక భయానకం

పోస్టుమార్టం నివేదిక ప్రకారం, అజిత్ శరీరంపై 44 గాయాల గుర్తులు ఉన్నట్లు బయటపడింది. అతడి నోటిలో, చెవుల్లో, వీపు భాగంలో కారం పొడి వేసిన跂 రుజువులు బయటపడ్డాయి. దీనిపై న్యాయమూర్తి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, “ఇతడు ఎలాంటి నేర చరిత్ర లేని వ్యక్తి. అలాంటి వాడిపై ఇంతటి పాశవిక దాడి ఎందుకు?” అని ప్రశ్నించారు.

దర్యాప్తులో పోలీసుల వైఫల్యం – కోర్టు విమర్శలు

ఎఫ్‌ఐఆర్ నమోదు ఆలస్యం, ఫోరెన్సిక్ ఆధారాల సేకరణలో నిర్లక్ష్యం వంటి అంశాలను హైకోర్టు తీవ్రంగా ఎండగట్టింది. “ఇది నిజంగా కస్టడీ మర్డర్‌నే” అనే అభిప్రాయాన్ని న్యాయస్థానం వ్యక్తం చేసింది.

ప్రభుత్వం స్పందన

తమిళనాడు ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాది, కేసు సీబీఐకి బదిలీ చేయడంపై “రాష్ట్రానికి ఎటువంటి అభ్యంతరం లేదని” హైకోర్టుకు స్పష్టం చేశారు.

అజిత్ కుటుంబానికి సీఎం క్షమాపణ

అజిత్ తల్లిని కలిసి క్షమాపణలు తెలిపిన సీఎం స్టాలిన్, “బాధిత కుటుంబానికి పూర్తిగా న్యాయం చేస్తాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం” అంటూ హామీ ఇచ్చారు.

 

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mystery Dead Bodies: వేర్వేరు చోట్ల ఇద్దరి మృతదేహాలు లభ్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *