Balakrishna

Balakrishna: బాలయ్యతో తమన్నా స్పెషల్ సాంగ్‌?

Balakrishna: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ 111వ చిత్రం మరోసారి మాస్ జాతర కానుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్ చెయ్యనుంది. వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి బ్లాక్‌బస్టర్లతో ఫుల్ జోష్‌లో ఉన్న బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో ‘అఖండ-2’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. అదే సమయంలో గోపీచంద్ మలినేనితో ఆయన 111వ చిత్రం కూడా వేగంగా సాగుతోంది. వచ్చే నెల మూడో వారం నుంచి కొత్త షెడ్యూల్ మొదలుకానుంది.

Also Read: Mokshagna: మోక్షజ్ఞ హీరోయిన్‌గా బాలీవుడ్ యంగ్ బ్యూటీ?

ఈ షెడ్యూల్‌లో ఓ భారీ స్పెషల్ సాంగ్ చిత్రీకరణ ఉంటుందని, దానికి తమన్నాను ఎంపిక చేశారని సమాచారం. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు గోపీచంద్ మలినేని “గాడ్ ఆఫ్ మాసెస్ ఈజ్ బ్యాక్.. ఈసారి మా గర్జన మరింత గట్టిగా ఉంటుంది. ఇది చరిత్రలో నిలిచిపోయే సినిమా” అని ఎలివేషన్స్ ఇవ్వడంతో అభిమానుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. ఇక బాలయ్య-తమన్నా కాంబినేషన్‌లో స్టెప్పులు ఎలా ఉంటాయో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *