ICC Arrest Warrant: మహిళలు, బాలికల హక్కులను గాలికొదిలేసిన తాలిబన్ నేతలపై ఇక ప్రపంచం కన్నెత్తి చూస్తోంది. మానవ హక్కులకు శత్రువులుగా నిలిచిన ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ నేతలపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.
తాలిబన్ సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుంద్జాదా, ఆఫ్ఘనిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి అబ్దుల్ హకీమ్ హక్కానీలను బాధ్యులుగా ప్రకటించింది. మహిళలు, బాలికల హక్కులను భంగపరిచే విధానాలను వారు అమలు చేశారని కోర్టు తెలిపింది.
విద్య, వ్యక్తిగత స్వేచ్ఛ, ఆలోచనా స్వేచ్ఛ, మత స్వేచ్ఛ వంటి ప్రాథమిక హక్కులను హరించారని ఆరోపించింది.
తాలిబాన్ పాలనలో మహిళల దుస్థితి
2021లో తాలిబన్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆఫ్ఘనిస్తాన్ మహిళల జీవితం పూర్తిగా మారిపోయింది.
-
పని చేయడంపై నిషేధం
-
బాలికల విద్యపై నిషేధం
-
వీధుల్లో తిరగడం, పార్కుల్లోకి వెళ్లడం, బహిరంగంగా మాట్లాడడం పై నిషేధాలు
ఇలా మహిళలను గృహాల్లోనే పూసి పెట్టేలా చేసిన తాలిబన్‌పై ఇప్పుడు ప్రపంచం ఉక్కుపాదం మోపుతోంది.
ICC చర్యల వెనక ప్రధాన కారణాలు:
-
మానవత్వానికి వ్యతిరేక నేరాలు
-
లింగ వివక్ష, శారీరక, మానసిక హింస
-
బలవంతపు వివాహాలు, అత్యాచారాలపై న్యాయ రక్షణలను తొలగించటం
“ఇది నేరమే!” – ఆఫ్ఘన్ మహిళలు
ఈ నిర్ణయం ఆఫ్ఘన్ మహిళలకు ఊరటను ఇచ్చింది. కెనడాలో నివసిస్తున్న ఆఫ్ఘన్ హక్కుల కార్యకర్త తహెరా నసిరీ స్పందిస్తూ, “ఇప్పటివరకు తాలిబన్లు మమ్మల్ని మౌనంగా ఉండమని, ఇంట్లో ఉండమని, కలలు కనొద్దని అంటున్నారు. కానీ ఇప్పుడు అంతర్జాతీయ కోర్టు చెబుతోంది, ‘ఇది నేరం!’ అని” అంటూ హర్షం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Crime News: భర్త ఇద్దరు కోడళ్ళు.. మధ్యలో అత్త మృతి!
తాలిబన్ నేతలపై చర్యలకి అంతర్జాతీయ పిలుపు
-
హ్యూమన్ రైట్స్ వాచ్, యునైటెడ్ నేషన్స్ వంటి సంస్థలు ఈ అరెస్ట్ వారెంట్లను స్వాగతించాయి.
-
తాలిబన్‌ను మద్దతు ఇస్తున్న దేశాలు కూడా ఈ అంశంలో స్పందించాలని ఆశిస్తున్నారు.
-
ICC సభ్య దేశాలు తాలిబన్ నేతలను అరెస్ట్ చేయాలని పిలుపునిచ్చాయి.
ముఖ్యమైన విషయమేమిటంటే…
ఈ అరెస్ట్ వారెంట్లు అనేవి కేవలం కాగితపు ఉత్తర్వులు కావు. ఇవి తాలిబన్ నేతలపై అంతర్జాతీయంగా “వాంటెడ్ నేరస్థులు” అనే ముద్ర వేస్తాయి. ఇకపై వారు ప్రపంచంలో ఎక్కడైనా పట్టుబడే అవకాశముంది.

