Talasani srinivas: బీఆర్ఎస్ పాలనలోనే హైదరాబాద్ అత్యద్భుతంగా అభివృద్ధి చెందిందని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం జూబ్లీహిల్స్‌లో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… సీఎం రేవంత్ రెడ్డి పదవీ స్వీకారం చేసి రెండేళ్లు పూర్తయినా, హైదరాబాద్ అభివృద్ధి విషయంలో ఎలాంటి పనులు చేయలేదని ఆరోపించారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల తర్వాత ఆ ప్రాంతంలో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి చూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని సవాలు విసిరారు.
జూబ్లీహిల్స్‌లో ఓటమి భయంతోనే అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చారని విమర్శించారు. కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే రేషన్ కార్డులు, బియ్యం నిలిపేస్తామని అధికార పార్టీ నేతలు ప్రజలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధి, సంక్షేమం ఎలా చేయాలో బీఆర్ఎస్‌కి బాగా తెలుసని అన్నారు.
జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేసిన తలసాని, మాగంటి సునీత భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

