Nagarjuna: సెకండ్ ఇన్నింగ్స్ లో జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్న జగ్గుభాయ్.. ఇప్పుడు జయమ్ము నిశ్చయమ్మురా షోతో హోస్ట్ గా మారారు. నాగార్జున ఫస్ట్ గెస్ట్.. ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్ షిప్ వల్ల కాస్త ఓపెన్ గానే మాట్లాడుకోబోతున్నారని ప్రోమో హింట్ ఇచ్చింది. నాగ్ అన్నయ్య వెంకట్ అక్కినేని, సోదరి నాగసుశీల కూడా సందడి చేశారు. “టబు, రమ్యకృష్ణ.. ఇద్దరిలో ఎవరు బెస్ట్ కో యాక్ట్రెస్?” అని జగపతి బాబు అడిగితే.. నాగ్.. ఆన్సర్ చెప్పనన్నాడు. అంతటితో ఆగకుండా.. `నీ ఫేవరెట్ ఎవరు రమ్యకృష్ణనా, సౌందర్యనా?” అని జగ్గూభాయ్ ని అడిగాడు. దానికాయన.. “ఇది నా ఇంటర్వూ కాదు.. నేను చెప్పను` అంటూ నవ్వేశారు.. అయితే రమ్యకృష్ణ లేదా టబు ఇద్దరిలో ఎవరో ఒకరు షోలో కాసేపు కనిపించబోతున్నారనే వార్త వినిపిస్తోంది.. వీరి ఫ్యాన్స్ తో పాటు తెలుగు ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ క్రేజీ టాక్ షో.. ఆగస్టు 17న రాత్రి 9 గంటలకు టెలికాస్ట్ కానుంది..
