Taapsee Pannu: ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన తాప్సీ తన ప్రతిభతో ఉత్తరాది ప్రేక్షకుల మనసుల్నీ జయించింది. ప్రస్తుతం కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ చిత్రాలూ చేసి మెప్పిస్తోంది. ఏ విషయం గురించి అయినా ముక్కు సూటిగా మాట్లాడే తాప్సీ హీరోయిన్ల పారితోషికం గురించి కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసింది. ‘జుడ్వా -2’, ‘డంకీ’ చిత్రాలలో తాను భారీ మొత్తంలో పారితోషికం తీసుకున్నట్టు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని తాప్సీ తెలిపింది. నిజానికి హీరో ఓరియంటెడ్ మూవీస్ లో హీరోయిన్లకు ప్రాధాన్యం ఇవ్వరనీ, పారితోషికం విషయంలోనూ చిన్నచూపే ఉంటుందని చెప్పింది. స్టార్ హీరో సినిమాలో అవకాశం ఇవ్వడమే ఫేవర్ గా దర్శక నిర్మాతలు భావిస్తుంటారని ఆమె వాపోయింది. మంచి ప్రాజెక్ట్స్ ఇచ్చి కెరీర్ ఉన్నతికి సాయం చేసినట్టుగా వారు మాట్లాడతారని చెప్పింది.
ఇది కూడా చదవండి: Sivakarthikeyan: తెలుగువారిని ఆకట్టుకుంటున్న శివకార్తికేయన్!
