Swech Suicide Case: ప్రముఖ మహిళా జర్నలిస్టు స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్ నాయక్ ఎట్టకేలకు నిన్న రాత్రి (జూన్ 28న) 11 గంటలకు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. న్యాయవాదితో కలిసి వచ్చిన అతను చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ప్రధానంగా స్వేచ్ఛ మృతి అనంతరం ఆమె తల్లిదండ్రులు ప్రధానంగా తమ కూతురు మరణానికి పూర్ణచందర్‌యే కారణమని ఆరోపించారు. ఆ ఆరోపణల నేపథ్యంలో పోలీసులు విచారిస్తుండగానే, పూర్ణచందర్ లొంగిపోయాడు.
Swech Suicide Case: స్వేచ్ఛకు గతంలోనే వివాహం జరిగింది. వారికి ఓ కూతురు జన్మించారు. అయితే కొన్నాళ్ల తర్వాత వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఓ న్యూస్ చానల్‌లో పనిచేసిన పూర్ణచందర్‌తో కలిసి ఉంటున్నది. వీరిద్దరి మధ్య గత కొన్నాళ్లుగా విభేదాలు చోటుచేసుకున్నట్టు తెలిసంది. ఆ తర్వాత పూర్ణచందర్‌తో తాను కలిసి ఉండలేనని తన తల్లిదండ్రులకు స్వేచ్ఛ చెప్పినట్టు తెలిసింది.
Swech Suicide Case: పెళ్లి చేసుకుంటానని స్వేచ్ఛకు మాటిచ్చిన పూర్ణ చందర్ కాలయాపన చేస్తుండగా, ఇద్దరి మధ్య గొడవ జరిగిందని సమాచారం. ఈ విషయంలో స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నదా? అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వేచ్ఛ ఆత్మహత్యపై ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తంచేయడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. తన కూతురు స్వేచ్ఛ మరణానికి పూర్ణచందర్‌యే కారణమంటూ ఆమె తండ్రి శంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడేండ్లుగా తన కూతురు వెంట పూర్ణచందర్ పడ్డాడని, అతడి వేధింపుల వల్లనే తన కూతురు ఆత్మహత్య చేసుకున్నదని ఆరోపించారు.
Swech Suicide Case: ఇదిలా ఉండగా, ఈ ఆరోపణల నేపథ్యంలో పూర్ణచందర్ ఐదు పేజీల లేఖను విడుదల చేశాడు. స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో తాను నిర్దోషినని అతను తన లేఖలో పేర్కొనడం గమనార్హం. 2009 నుంచి స్వేచ్ఛతో తనకు పరిచయం ఉన్నదని, 2020 నుంచి తనకు దగ్గరైందని పూర్ణచందర్ పేర్కొన్నాడు.

