Peddi: రామ్‌చరణ్ హీరోగా, బుచ్చి బాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాపైన ఇప్పటికే భారీ అంచనాలను రేపుతోంది. స్టార్ కాస్టింగ్, భారీ బడ్జెట్, మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్ సంగీతం ఈ సినిమాను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఇంత హైప్ మధ్య, ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.
మలయాళ నటి స్వసికకు ఈ సినిమాలో రామ్‌చరణ్ తల్లి పాత్ర ఆఫర్ వచ్చినట్లు సమాచారం. అయితే కేవలం 33 ఏళ్ల వయసులోనే అలాంటి పాత్ర చేయడానికి తాను సిద్ధంగా లేనని ఆమె స్పష్టం చేశారు. “ఇటీవల నాకు వరుసగా తల్లి పాత్రల ఆఫర్లు వస్తున్నాయి. కానీ రామ్‌చరణ్ తల్లిగా నటించడం ఈ దశలో నా కెరీర్‌కి సరిపడదనిపించింది. అందుకే నేను ‘నో’ చెప్పాను. భవిష్యత్తులో చేస్తానేమో కానీ ఇప్పుడే కాదు” అని స్వసిక ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Paramasundari: పరమసుందరి జోరు.. బుక్ మై షోలో రికార్డ్!
సినిమా బృందం నుంచి ఆమెను ఒప్పించే ప్రయత్నాలు జరిగినా, స్వసిక తన నిర్ణయంపై నిలదొక్కుకున్నారని తెలిసింది.
పెద్దిలో రామ్‌చరణ్‌కు జోడీగా జాన్వి కపూర్ నటిస్తుండగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.
గతేడాది తమిళంలో విడుదలైన లబ్బర్ పండుతో మంచి గుర్తింపు తెచ్చుకున్న స్వసిక, ప్రస్తుతం సూర్యతో కలిసి కరుప్పు సినిమాలో నటిస్తోంది
Nannu #Peddi lo #RamCharan mother role cheyyamani adagaaru… kani nenu cheyyanu ani cheppanu
Ee stage lo #RamCharan mother role cheyyalsina avasaram ledani anipistundi..
Malayalam Actress #Swasika#Swasika #Swasika #buchibabusana #ARRahman pic.twitter.com/YKSvQ9SjwV
— s5news (@s5newsoffical) August 25, 2025