SWAG OTT: మూడు వారాల్లోనే ఓటీటీలో 'శ్వాగ్'

SWAG OTT: మూడు వారాల్లోనే ఓటీటీలో ‘శ్వాగ్’

SWAG OTT: డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడానికి హీరో శ్రీవిష్ణు తహతహలాడుతూ ఉంటాడు. అయితే ఆ స్థాయిలో విజయాలు మాత్రం అతనికి దక్కడం లేదు. దానికి తాజా ఉదాహరణ ఇటీవల వచ్చిన ‘శ్వాగ్’. గతంలో హసిత్ గోలి దర్శకత్వంలో శ్రీవిష్ణు ‘రాజరాజచోర’ చిత్రంలో నటించాడు. అది మంచి విజయాన్ని అందుకుంది. అయితే ‘శ్వాగ్’ ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయింది. శ్రీవిష్ణు నాలుగు భిన్నమైన పాత్రలు చేసిన ‘శ్వాగ్’ మూవీ ఇదే నెల 4న విడుదలైంది. ఇక మూడువారాలు తిరగకముందే ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ప్రత్యక్షమైంది. నెగెటివ్ టాక్ తెచ్చుకోవడంతో ధియేటర్ కు వెళ్ళడానికి జంకిన జనాలు ఇప్పుడు ఓటీటీలో అయినా శ్రీవిష్ణు కోసం ఈ సినిమాను చూస్తారేమో చూడాలి!!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Hyderabad: గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. స్కూల్ విద్యార్థులకు స్నాక్స్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *