Suvvi Suvvi: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఓజీ’ (OG) నుంచి కొత్త మెలోడి సాంగ్ విడుదలైంది. ఇప్పటికే భారీ అంచనాలను రేకెత్తించిన ఈ చిత్రంలోని తాజా సాంగ్ “సువ్వి సువ్వి” వినాయక చవితి కానుకగా చిత్ర యూనిట్ ప్రేక్షకుల ముందుకు తెచ్చింది.
ఈ గీతాన్ని గాయని శ్రుతి రంజని ఆవిష్కరించగా, సాహిత్యం కళ్యాణ్ చక్రవర్తి రాశారు. మధురమైన లిరిక్స్‌కు తగినట్టు సంగీత దర్శకుడు థమన్ తన ప్రత్యేకమైన మెలోడి టచ్‌తో ఈ పాటను మరింత హృద్యంగా తీర్చిదిద్దారు. “ఉండిపో ఇలాగా.. తోడుగా.. నా మూడు ముళ్లలాగా” వంటి లైన్లు ప్రేమలోని ఆప్యాయతను ప్రతిబింబిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Aneeth Padda: అనీత్ పడ్డా నుంచి మరో రొమాంటిక్ డ్రామా!
ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంకా మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది.
గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ‘ఓజీ’ టీజర్ నుండి పాటల వరకు ప్రతి అప్‌డేట్‌తో అభిమానుల్లో హైప్‌ను పెంచుతోంది. ‘సువ్వి సువ్వి’ సాంగ్‌తో ప్రేక్షకుల ఆసక్తి మరింత పెరిగి, సినిమా కోసం ఎదురుచూస్తున్న వాతావరణాన్ని కల్పించింది.

