Hyderabad: ఇటీవల వరుసగా చూస్తూనే ఉన్నాము. భార్యను హత్య చేసిన ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల గురుమూర్తి భార్యను ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేసిన సంగతి తెలిసిందే.. తాజాగా హైదరాబాద్ మలక్‌పేటలో శిరీష అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె గుండెపోటుతో చనిపోయిందని.. భర్త, అత్తమామలు శిరీష తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు రాకముందే.. అంత్యక్రియల కోసం శిరీష మృతదేహాన్ని సొంతూరు దోమలపెంటకు తరలించే ప్రయత్నం చేశారు.
శిరీష తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో.. మృతదేహాన్ని తీసుకెళ్తున్న వాహనాన్ని సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. వాహనం నుంచి శిరీష మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం కోసం తరలించారు. శిరీష మృతదేహంపై గాయాలు ఉన్నాయని.. భర్తే ఆమెను కొట్టి చంపారని తల్లిందండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read: IIT Baba Arrest: ఐఐటీ బాబా అరెస్టు, డ్రగ్స్ స్వాధీనం
అనాధ అయిన శిరీషను.. ఓ ప్రొఫెసర్ కుటుంబం దత్తత తీసుకుంది. వాళ్ల దగ్గర ఉంటున్న శిరీషను ప్రేమిస్తున్నానని చెప్పి.. హైదరాబాద్‌కి చెందిన వినయ్ 2017లో శిరీషను వివాహం చేసుకున్నాడు. కానీ ఏ ఒక్కరోజు కూడా తనను ప్రశాంతంగా ఉండనివ్వలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. పెళ్లయ్యాక శిరీషను వినయ్‌కుమార్ వేధించేవాడని, అతనే ఆమెను చంపి ఉంటాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
భర్త వినయ్ అత్తమామలు కొట్టి చంపారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తనకు విహాయం అయినప్పటి నుంచి టార్చర్ చూపిస్తున్నాడని, అనుమానంతో ప్రతిరోజు తాగొచ్చి తనను కొడతాడని శిరీష కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.