Crime News: మొత్తానికైతే చంపేశారు. పక్కాగా తెలిసిపోతుంది. చెట్టు కొమ్మకు వురి వేసుకుని చనిపోయేలా ప్రీ ప్లాన్ ఐతే చేశారు కానీ…అది ఆత్మహత్య కాదు. పక్కా హత్య . అంత దారుణంగా చంపడానికి కారణం అతడేనా ? ఎందుకంటే నిత్యం ఆ ఇంట్లో ఎదో ఒక గొడవలు. అలా గొడవలు జరిగే ఆ ఇంట్లో …ఆ ఇంటి ఇలాళ్ళు చనిపోయింది అంటే అందుకు కారణం ఎవరై ఉంటారు. ఇలా ఎన్ని అనుమానాలు
వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో చోటుచేసుకుంది. ఎల్విన్ పేటకు చెందిన జన్ని రజని భర్త ఉదయ్ కుమార్ ప్రభుత్వ ఉద్యోగి. వీరికి కుమారుడు ఉన్నాడు. తరచూ ఇంట్లో గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Shocking Video: పెళ్లింట విషాదం.. స్టేజ్‌పై డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువతి
రజని ఇంటి నుంచి బయటకు వెళ్లారు. సమీపంలోని ఓ తోటలో ఆమె మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ హరితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించాలని ఎస్‌ఐ తెలిపారు. చెట్టు కొమ్మ తక్కువ ఎత్తులో ఉందని, రజని మోకాళ్లు నేలను తాకుతున్నాయని, ఆమె ముఖంపై గాయాలు ఉన్నాయని తెలిపారు.
ఘటనా స్థలంలో ఎలుకల మందు, నీటి సీసా లభ్యమయ్యాయని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్‌ఐ వివరించారు.