GHAATI

GHAATI: అనుష్క ‘ఘాటి’ రిలీజ్‌పై సస్పెన్స్!

GHAATI: స్వీటీ అనుష్క శెట్టి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ఘాటి’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ అభిమానులను ఆకట్టుకోవడంతో, ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందనే ఆసక్తి పెరిగింది.

మేకర్స్ గతంలో ఈ సినిమాను ఏప్రిల్ 18న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఊహించని జాప్యం జరుగుతుంది. దీంతో రిలీజ్ తేదీపై అయోమయం నెలకొంది. ఈ విషయంలో నిర్మాతల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది.

Also Read: Varsham: ప్రభాస్ ‘వర్షం’ రీ-రిలీజ్‌తో మళ్లీ సందడి!

GHAATI: ‘ఘాటి’ రిలీజ్ ఎప్పుడు అనే ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.క్రిష్ జాగర్లమూడి నుంచి హిట్ మూవీ వచ్చి ఎన్నో ఏళ్లు. ‘ఘాటి’తో ఆయన మళ్లీ తన గట్టి మార్క్ చూపిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. రిలీజ్ తేదీపై త్వరలోనే మేకర్స్ స్పష్టత ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఘాటి గ్లింప్సె  : 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *