Suryapet: అయ్యప్ప మాలలో ఉండి బీరు తాగిన ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవిత్రమైన అయ్యప్ప దీక్షలో ఉన్న సమయంలో ఇలాంటి చర్యకు పాల్పడటంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే – సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ ప్రాంతంలో ఒక వ్యక్తి అయ్యప్ప మాల ధరించి, గదిలో రహస్యంగా బీరు తాగుతూ ఉండగా, అతడి తోటి స్వాములు వీడియో తీశారు. అకస్మాత్తుగా గదిలోకి ప్రవేశించిన వారు అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు
వీడియోలో కనిపించిన దృశ్యాల ప్రకారం, అతడు కంగారుపడి ముఖం దాచుకుంటూ బయటకు వెళ్లిపోవడానికి ప్రయత్నించాడు. అయితే, తోటి స్వాములు అతడిని అడ్డుకుని, “ఇదేం ప్రవర్తన? అయ్యప్ప దీక్ష అంటే పవిత్రతకు ప్రతీక. ఇలా మద్యం సేవిస్తే అది అవమానం కాదా?”అని ప్రశ్నించారు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవడంతో భక్తుల మధ్య తీవ్ర చర్చనీయాంశమైంది. చాలామంది నెటిజన్లు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తూ వ్యాఖ్యానించారు “నిష్ఠగా ఉండలేని వారు దీక్ష ఎందుకు తీసుకుంటారు?”
అని ప్రశ్నించగా, మరో భక్తుడు
“ఇలాంటి వ్యక్తుల వల్ల నిజమైన భక్తుల పట్ల కూడా అపనింద వస్తోంది”
అని ఆవేదన వ్యక్తం చేశారు.
భక్తులు, స్థానికులు ఇలాంటి ఘటనలు అయ్యప్ప భక్తి స్ఫూర్తిని దెబ్బతీస్తాయని, సదరు వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

