Suryapet:

Suryapet: ఉన్న‌ది పోయింది.. అనుకున్న‌దీ దూర‌మైంది.. ఎస్ఐ ఉద్యోగం వ‌దులుకొని స‌ర్పంచ్‌గా పోటీ చేస్తే..

Suryapet: అనుకున్న‌దొక్క‌టి! అయ్యిందొక్క‌టి! అన్న‌ది ఓ సామెత‌. తానొక‌టి త‌లిస్తే.. దైవ‌మొక‌టి త‌లిచింది.. అన్న‌ది నానుడి. ఇక్క‌డ కూడా ఇదే సామెత రిపీట్ అయింది. తాజాగా జ‌రుగుతున్న పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో చిత్ర విచిత్రాల్లో ఇదీ ఒక‌టి. ఇక్క‌డ‌ ఓ అభ్య‌ర్థిని దుర‌దృష్టం వెంటాడింది. ఆయ‌న ఉన్న ఉద్యోగాన్ని వ‌దులుకొని రాజ‌కీయాల్లోకి వ‌చ్చి స‌ర్పంచ్‌గా పోటీ చేసి గ్రామానికి త‌న శేష జీవితాన్ని సేవ‌కు వినియోగించాల‌ని భావిస్తే త‌ల‌కిందులైంది.

Suryapet: సూర్యాపేట జిల్లా కోదాడ మండ‌లం గుడిబండ గ్రామానికి చెందిన వెంక‌టేశ్ల‌ర్లు ఎస్ఐగా ఉద్యోగం చేస్తున్నాడు. ఆయ‌నకు రిటైర్‌మెంట్ కాలం స‌మీపించింది. ఈ ద‌శ‌లో వ‌చ్చిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఆ మిగిలిన ఉద్యోగ కాలాన్ని వ‌దులుకోవాల‌ని భావించాడు. వెంట‌నే ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. పంచాయ‌తీ ర‌ణ‌రంగంలోకి దూకాడు. కాంగ్రెస్ పార్టీ బ‌ల‌ప‌ర్చిన అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచాడు.

Suryapet: ఇంకా ఐదు నెల‌లపాటు ఉద్యోగ‌ కాల‌ప‌రిమితి ఉండ‌గానే వెంక‌టేశ్వ‌ర్లు ఎస్ఐ ఉద్యోగం నుంచి వీఆర్ఎస్ తీసుకొన్నారు. తాను పుట్టిన ఊరికి సేవ చేయాల‌నే త‌లంపుతో త‌న ఉద్యోగానికి రాజీనామా చేశాన‌ని ప్ర‌చారం చేశాడు. గ్రామాభివృద్ధికి తోడ్పాటును అందించాల‌నే ఉద్దేశంతోనే తాను స‌ర్పంచ్‌గా పోటీ చేసిన‌ట్టు చెప్పుకున్నాడు. అయినా ఆ ఊరి ఓట‌ర్లు వెంక‌టేశ్వ‌ర్లు ఓడించి, ప్ర‌త్య‌ర్థినే గెలిపించారు.

Suryapet: వెంక‌టేశ్వ‌ర్లుకు కోదాడ ఎమ్మెల్యే ఉత్త‌మ్ ప‌ద్మావ‌తీ, మంత్రి ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి మ‌ద్దతు ప‌లికినా ఆయ‌న ఓట‌మి చెందారు. వారి మ‌ద్ద‌తు, ఉద్యోగ జీవితం త్యాగం ఫ‌లించ‌లేదు. దీంతో వెంక‌టేశ్వ‌ర్లుకు ఉన్న ఎస్ఐ ఉద్యోగం పోయింది. అనుకున్న స‌ర్పంచ్ ప‌ద‌వీ ద‌క్క‌లేదు. దీంతో రెంటికి చెడ్డ రేవ‌డిలా ఆయ‌న మిగిలాడ‌ని సోష‌ల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. అయితే ఆయ‌న నిబ‌ద్ధ‌త‌ను ప‌లువురు ప్ర‌శంసిస్తుండ‌గా, తొంద‌ర‌పాటు చ‌ర్య అని మ‌రికొంద‌రు ఆరోపిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *