Suryakumar Yadav

Suryakumar Yadav: మళ్ళీ ప్రయత్నిస్తా.. వన్‌డౌన్‌లో శివమ్‌ దూబె రావడంపై స్కై ఏం అన్నాడంటే ?

Suryakumar Yadav: 2025 ఆసియా కప్‌ సూపర్‌-4 మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన పోరులో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శివమ్ దూబేను మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడంపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ఈ వ్యూహంపై భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించారు. మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ, ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని వివరించారు. దూబే కొన్ని భారీ షాట్లు కొట్టడానికి ప్రయత్నించినప్పటికీ, రిషద్ హుస్సేన్‌ బౌలింగ్‌లో కేవలం 2 (3) పరుగుల వద్ద క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. బంగ్లాదేశ్ స్పిన్నర్లను, ముఖ్యంగా హుస్సేన్‌ను ఎదుర్కోవడానికి ఈ వ్యూహాన్ని అనుసరించామని వివరించారు.

ఈ ప్రయోగం ఈసారి విఫలమైనప్పటికీ, భవిష్యత్తులో అవకాశం వస్తే మళ్ళీ ప్రయత్నించడానికి వెనుకాడమని ఆయన చెప్పారు. ఎం.ఎస్. ధోని, చెన్నై సూపర్ కింగ్స్ కూడా దూబేను ఇలాగే ఉపయోగించుకున్నారు. మధ్య ఓవర్లలో ప్రత్యర్థి స్పిన్నర్లను టార్గెట్ చేయడం ద్వారా దూబే తన స్పిన్-హిట్టింగ్ సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. ఈ ప్రదర్శన అతన్ని తిరిగి భారత జట్టులోకి తీసుకొచ్చిందని చెప్పాడు. దూబే అవుటైన తర్వాత, భారత్ తగినంత వేగాన్ని పెంచలేకపోయింది. ఓపెనర్ అభిషేక్ శర్మ 37 బంతుల్లో 75 పరుగులు చేయడంతోనే భారత్ 168/6 పరుగుల గౌరవప్రదమైన స్కోరును చేరుకోగలిగింది.

ఇది కూడా చదవండి: Rajanna Sircilla: వాట్సప్ గ్రూప్‌లో కార్టూన్ పోస్టు.. అధికారిపై వేటు

మొదట బ్యాటింగ్ చేయడం పట్ల సూర్యకుమార్ సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు ఆసియాకప్ 2025లో టీమ్ ఇండియా ఫైనల్ చేరింది. బంగ్లాదేశ్‌తో జరిగిన సూపర్-4 మ్యాచులో 41 పరుగుల తేడాతో గెలుపొందింది. భారత బౌలర్లు విజృంభించడంతో 169 పరుగుల లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ సైఫ్ హాసన్(69) పోరాడినా ప్రయోజనం లేకపోయింది. భారత బౌలర్లలో కుల్దీప్ 3, వరుణ్, బుమ్రా తలో 2 వికెట్లు తీశారు. రేపు బంగ్లా-పాక్ మ్యాచ్‌తో భారత్ ఫైనల్ ప్రత్యర్థి ఖరారు కానుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *