Suryakumar Yadav

Suryakumar Yadav: శ్రేయాస్ అయ్యర్ త్వరగా కోలుకుంటున్నాడు:

Suryakumar Yadav: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో గాయపడిన టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్ ప్రస్తుతం కోలుకుంటున్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భరోసా ఇచ్చారు.

ఆస్ట్రేలియాతో జరగబోయే టీ20 సిరీస్‌కు ముందు మీడియాతో మాట్లాడిన సూర్యకుమార్, శ్రేయాస్ అయ్యర్ ఆరోగ్య పరిస్థితి గురించి ప్రస్తావించారు. అయ్యర్‌కు తీవ్రమైన గాయం అయినప్పటికీ, అతడు ఇప్పుడు ఫోన్‌లో స్పందిస్తున్నాడని, అందరితో మాట్లాడుతున్నాడని తెలిపారు.

ఇది కూడా చదవండి: Mass Jathara: మాస్ జాతర: ట్రైలర్‌తో అంచనాలు డబుల్!

“అయ్యర్ గాయపడిన విషయం తెలిసిన వెంటనే నేను అతనికి ఫోన్ చేశాను. అప్పుడు మాట్లాడలేదు. కానీ నిన్న, ఈరోజు అతడు ఫోన్‌లో రిప్లై ఇస్తున్నాడు. ‘అగర్ వో రిప్లై కర్ రహా హై’ (అతను సమాధానం ఇస్తున్నాడంటే), దాని అర్థం అతను స్థిరంగా ఉన్నాడని. డాక్టర్లు దగ్గరే ఉన్నారు. రాబోయే కొద్ది రోజులు అతన్ని పర్యవేక్షిస్తారు. కానీ అంతా బాగానే ఉంది,” అని సూర్యకుమార్ యాదవ్ మీడియాకు తెలిపారు.

వన్డే మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ శ్రేయాస్ అయ్యర్‌కు పక్కటెముకలకు గాయమై, అంతర్గత రక్తస్రావం కారణంగా ఆసుపత్రిలో చేర్చారు. అతని పరిస్థితి విషమంగా ఉందని మొదట వార్తలు వచ్చాయి. అయితే, సూర్యకుమార్ అప్‌డేట్ తర్వాత అభిమానుల్లో కొంత ఊరట లభించింది. అయ్యర్ త్వరగా కోలుకోవాలని టీమ్ మేట్స్, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *