Retro: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, గ్లామర్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా, టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన చిత్రం “రెట్రో”. థియేటర్లలో మిక్స్‌డ్ రెస్పాన్స్‌తో మొదలైన ఈ సినిమా, తమిళ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందింది. అయితే, నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తర్వాత ఈ మూవీ ఊహించని రీతిలో రచ్చ చేసింది! కేవలం వారంలోనే 4.2 మిలియన్ వ్యూస్‌తో ఓటీటీలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
Also Read: Andala Rakshasi: అందాల రాక్షసి రీరిలీజ్!
Retro: సూర్య ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్‌ను ఆకట్టుకున్న ఈ చిత్రం, స్టైలిష్ యాక్షన్, ఎమోషనల్ డ్రామాతో ఆకర్షిస్తోంది. సంతోష్ నారాయణన్ అదిరిపోయే మ్యూజిక్, 2డి సినిమాస్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ నిర్మాణ సౌందర్యం సినిమాకు హైలైట్. థియేటర్లలో సూర్య కం బ్యాక్ కోసం ఎదురుచూసినవారికి ఓటీటీలో ఈ రెట్రో రచ్చ ఓ అద్భుత అనుభవం పంచింది.

