Karuppu Teaser: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న కొత్త చిత్రం ‘కరుప్పు’. ఈ సినిమాను ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తుండగా, త్రిష హీరోయిన్గా నటిస్తోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రకాశ్‌బాబు మరియు ఎస్.ఆర్. ప్రభు నిర్మిస్తున్నారు. యోగిబాబు, శశివాద, నట్టి సుబ్రహ్మణ్యం తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
సూర్య పుట్టినరోజు సందర్భంగా (జూలై 23) మూవీ యూనిట్ ప్రత్యేకంగా ‘కరుప్పు’ టీజర్ విడుదల చేసి అభిమానులకు బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చింది. “కొబ్బరి కాయ కొట్టి కర్పూరం వెలిగిస్తే శాంతించే దేవుడు కాదు.. మనసులో మొక్కుకుని మిరపకాయలు దంచితే రుద్రుడై దిగి వచ్చే దేవుడు” అనే పవర్ఫుల్ వాయిస్ ఓవర్‌తో టీజర్ మొదలైంది.
ఇది కూడా చదవండి: Annadata Sukhibhava: అకౌంట్లోకి రూ. 20 వేలు.. ఇవ్వాళే లాస్ట్ డేట్
“నా పేరు సూర్య… నాకు ఇంకో పేరు ఉంది”, “ఇది నా టైమ్” అంటూ సూర్య చెప్పిన డైలాగ్స్ మాస్ ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకుంటున్నాయి. యాక్షన్ సీక్వెన్స్‌లు కూడా స్టైలిష్‌గా కనిపిస్తున్నాయి. మొత్తం 1 నిమిషం 42 సెకన్ల ఈ టీజర్ సూర్య అభిమానుల్లో మంచి హైప్ క్రియేట్ చేస్తోంది.
ఇక సూర్య గత చిత్రాలు ‘కంగువ’, ‘రెట్రో’ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. అయితే ‘కరుప్పు’ టీజర్ చూస్తుంటే మాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందనే అంచనాలు పెరుగుతున్నాయి. ‘కరుప్పు’ అంటే తమిళంలో “నలుపు” అని అర్థం. టైటిల్ కూడా తమిళ ఫ్లేవర్‌తోనే ఉంచినట్లు తెలుస్తోంది.

