surya fans:

Surya Fans: రజనీని విమర్శిస్తున్న సూర్య ఫ్యాన్స్

Surya Fans: కథానాయకులు మధ్య సఖ్యత బాగానే ఉంటుంది. ఎటొచ్చి వారి అభిమానులే రకరకాల మాధ్యమాలలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటారు. ఇప్పుడు తమిళనాట అదే జరుగుతోంది. సూర్య నటించిన ‘కంగువ’ నవంబర్ 14న విడుదల కాబోతోంది. దీని ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి రజనీకాంత్ ను గెస్ట్ గా ఆహ్వానిస్తే… రాలేనని అన్నారట. అది సూర్య ఫ్యాన్స్ కు ఆగ్రహాన్ని తెప్పించింది. రజనీకాంత్ ‘వేట్టయాన్’ మూవీ కోసం సూర్య తన ‘కంగువ’ను వాయిదా వేసుకున్నారని, కానీ రజనీకాంత్ మాత్రం సూర్య పిలిచినా ‘కంగువ’ వేడుకకు రాలేదని విమర్శిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Naga Chaitanya Marriage Date: చైతు, శోభిత పెళ్ళి డేట్ ఫిక్స్!

Surya Fans: అయితే రజనీకాంత్ ప్రత్యక్షంగా ఈ వేడుకలో పాల్గొనకపోయినా ఓ వీడియో సందేశాన్ని పంపించారు. దర్శకుడు శివతో తాను ‘అన్నాత్తే’ చేస్తున్నప్పుడు మంచి హిస్టారికల్ సబ్జెక్ట్ రాయమని చెప్పానని, అయితే అతను ఇప్పుడు ఆ కథను రాసి సూర్యతో తీశారని చమత్కరించారు. మొత్తానికీ రజనీకాంత్, సూర్య బాగానే ఉన్నారు. వారి ఫ్యాన్స్ మధ్య చిన్నపాటి కోపాలు తాపాలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *