surya

surya: 49లోనూ సూర్య సిక్స్ ప్యాక్!?

surya: సూర్య నటించిన ‘కంగువ’ వచ్చే నెల 14న రిలీజ్ కాబోతోంది. పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ మూవీ కోసం సూర్య ప్రచారంలో బిజీగా ఉంటున్నారు. ఇటీవల ఢిల్లీ, ముంబైతో పాటు నార్త్ ఇండియాలో ఫుల్ ప్రమోషన్ చేస్తున్నాడు. అందులో భాగంగా ‘కంగువ’ కోసం 49 ఏళ్ళ వయులో సిక్స్ ప్యాక్ చేశానని చెప్పారు సూర్య. నిజానికి 20 సంవత్సరాల క్రితమే సూర్య సిక్స్ ప్యాక్ చేశాడు. ఇప్పుడు ‘కంగువా’ కోసం చేయటం ఎంతో మందికి స్ఫూర్తిని ఇస్తోంది. తను ఏ సినిమా చేసినా కష్టపడి చేస్తానని, ఇప్పుడు కంగువా కోసం సిక్స్ ప్యాక్ చేయటం కూడా తృప్తిని ఇస్తోందన్నారు.

ఇక ‘గజనీ2’ ప్రపోజల్ ని అల్లు అరవింద్ తీసుకువచ్చారని, తను రెడీ అని చెప్పానన్నారు సూర్య. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి కాగానే ‘రోలెక్స్’ సినిమా మొదలు పెడతానంటూ ‘కంగువ’ విజయంపై పూర్తి స్థాయిన నమ్మకం ఉందంటున్నాడు సూర్య. ‘కంగువా’లో సూర్య ద్విపాత్రాభినయం చేయగా బాబీ డియోల్ ప్రతినాయకుడుగా నటించారు. దిశాపటాని హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్, స్టూడియో గ్రీన్ నిర్మించాయి. మరి సూర్య పడ్డ కష్టానికి ప్రతిఫలంగా ‘కంగువా’ సక్సెస్ ను అందుకుంటుందేమో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *