Suriya 45: కోలీవుడ్ స్టార్ సూర్య తాజాగా ‘రెట్రో’ చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఇప్పుడు తన 45వ చిత్రంతో మరోసారి సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. దర్శకుడు ఆర్‌జే బాలాజీ రూపొందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ జూన్ 20న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రీ-లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచింది. రేపు వచ్చే ఫస్ట్ లుక్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి.
Also Read: Naga Chaitanya: నాగ చైతన్య 25వ సినిమా అప్డేట్.. శివ నిర్వాణతో మరో సూపర్ హిట్?
Suriya 45: ఈ చిత్రానికి సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ స్వరాలు అందిస్తుండగా, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఏఆర్ ప్రకాష్ బాబు, ఎస్‌ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే, సూర్య తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో కలిసి మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. ఈ రెండు ప్రాజెక్ట్‌లతో సూర్య మరోసారి తన హవా నిరూపించేందుకు రెడీ అవుతున్నాడు.
The countdown begins! ⏳🔥
The much-awaited #Suriya45 title look drops tomorrow, and the excitement is sky-high!Can’t wait to see what magic #RJBalaji is brewing for the powerhouse performer @Suriya_offl 💥 pic.twitter.com/04pErDVtGh
— Ramesh Bala (@rameshlaus) June 19, 2025