The Raja Saab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరోసారి ప్రేక్షకుల ముందుకు అద్భుతమైన కాన్సెప్ట్‌తో రాబోతున్నారు. ఆయన హీరోగా మారుతీ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్’. ఈ చిత్రం హారర్ ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ప్రస్తుతం గ్రీస్‌లో షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అక్కడ ప్రభాస్ పాల్గొంటున్న పాటల సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.
ఇటీవల దర్శకుడు మారుతీ సోషల్ మీడియాలో షేర్ చేసిన అప్‌డేట్‌లో ప్రభాస్ ‘రాజా సాబ్’ టీ-షర్ట్ ధరించి కనిపించారు. ఈ ఫోటోలు చూసి అభిమానులు సోషల్ మీడియాలో సంబరపడుతున్నారు. ప్రభాస్ కొత్త లుక్ స్టైలిష్‌గా, ఫ్రెష్‌గా ఉందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.
Also Read: Bigg Boss 9: కూర్చోపోతే ఊరుకోరా..?వెక్కి వెక్కి ఏడ్చిన దివ్వెల మాధురి..!
సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ కథానాయికలుగా నటిస్తున్నారు. సంగీతాన్ని థమన్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ ఖర్చుతో నిర్మిస్తోంది. ఈ సినిమాలోని దృశ్యాలు, భయానక అంశాలు, భావోద్వేగ క్షణాలు—అని కలిసి ప్రేక్షకులకు ఒక అద్భుతమైన వినోదాన్ని అందిస్తాయని టాక్ వినిపిస్తోంది.
మారుతీ, ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా ఫన్, ఫియర్, ఫాంటసీ మిక్స్‌గా ప్రేక్షకులను అలరించబోతోందని టీమ్ చెబుతోంది. ఈ మాస్ హారర్ ఎంటర్‌టైనర్‌ను వచ్చే ఏడాది జనవరి 9న పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేయనున్నారు.