Suriya: తమిళ హీరో సూర్య నటిస్తున్న ‘కరుప్పు’ సినిమా సంక్రాంతి రిలీజ్‌పై సందిగ్ధత నెలకొంది. భారీ పోటీ కారణంగా సూర్య టీమ్ సమ్మర్ రిలీజ్ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. పొంగల్ సీజన్‌లో టాప్ హీరోల సినిమాలతో పోటీ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. సూర్య సినిమా రిలీజ్‌పై క్లారిటీ రావాల్సి ఉంది. పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Bigg Boss 9: బిగ్ బాస్ లో పెరుగుతున్న బాడీ షేమింగ్.. తొలి కెప్టెన్ గా సంజన
సూర్య నటిస్తున్న ‘కరుప్పు’ సినిమా సంక్రాంతి రిలీజ్ ప్లాన్‌ను వాయిదా వేసే అవకాశం ఉంది. విజయ్ నటిస్తున్న ‘జన నాయగన్’ జనవరి 9న, శివకార్తికేయన్ నటిస్తున్న ‘పరాశక్తి’ జనవరి 14న రిలీజ్ కానున్నాయి. ఈ రెండు భారీ చిత్రాలతో పోటీ తప్పదని భావించిన సూర్య టీమ్, సమ్మర్ రిలీజ్‌ను ఎంచుకునే యోచనలో ఉన్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సూర్య గత చిత్రాలు అనుకున్న విజయం సాధించకపోవడంతో, ఈ చిత్రంతో సక్సెస్ ట్రాక్ ఎక్కాలని ఆశిస్తున్నారు.