Ravi Teja: సూర్య హీరోగా ఇటీవల వచ్చిన ‘కంగువ’ సినిమా తన కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఆ పరాజయాన్ని మరిచి తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టాడు సూర్య. అందులోభాగంగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య44 ను పూర్తి చేశాడు. ఇందులో పూజహేగ్డే హీరోయిన్. లవ్, లాఫ్టర్, వార్ అనే ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే దీని తర్వాత ఆర్.జె. బాలాజీ దర్శకత్వంలో కమిట్ అయిన సినిమా షూటింగ్ ను ఇటీవల మొదలు పెట్టారు. ఇక ఈ సినిమా కథకు సంబంధించిన అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీని కథ తెలుగులో రవితేజ హీరోగా రమేశ్ వర్మ తీసిన ‘వీర’ సినిమా కథకు దగ్గరగా ఉంటుందట. దీంతో సూర్య చేయబోతున్నది ప్లాఫ్ సినిమా రీమేక్ కథనా అంటున్నారు. దీనిని సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్ టైన్ మెంట్స్ తీస్తుండటం విషేశం. అయితే ఈ రూమర్స్ విషయంలో మేకర్స్ నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి క్లారిఫికేషన్ రాలేదు. చూడాలి మరి మేకర్స్ ఏం చెబుతారో!?
