Suriya

Suriya: అగరం ఫౌండేషన్ కి స్ఫూర్తి చిరంజీవి గారే – సూర్య

Suriya:  కొద్ది రోజులుగా కోలీవుడ్ స్టార్ సూర్య అగరం ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవల గురించిన పిక్స్, వీడియోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. గత 15 ఏళ్లల్లో అగరం ద్వారా 8 వేలమంది చదువు పూర్తి చేశారు. అందులో 1800ల మంది ఇంజినీర్లు, 51 మంది డాక్టర్స్ ఉన్నారు.. అయితే ఇంత పెద్ద ఫౌండేషన్ ఏర్పాటు చేయడానికి మెగాస్టార్ చిరంజీవి గారే తనకు స్ఫూర్తి అని చెప్పారు సూర్య..

Also Read: War 2: ‘వార్ 2’ నుంచి అదిరిపోయే సాంగ్ టీజర్: ఎన్టీఆర్‌-హృతిక్‌ డ్యాన్స్‌ అదుర్స్!

సూర్య ఫౌండేషన్ ద్వారా ప్రయోజకులైన వాళ్లందరూ 15వ యానివర్సరీ కార్యక్రమంలో స్టేజ్ మీదికొచ్చి.. అగరం ద్వారా తమ జీవితాలు ఎలా మారాయో చెప్తుంటే.. సూర్య ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ చూసిన తర్వాతే తాను ఎన్జీవో ఏర్పాటు చేశానని.. దీని ద్వారా 6 వేల మంది స్టూడెంట్స్ డిగ్రీ పూర్తి చేశారని, చిరంజీవి గారు నాకు పర్సనల్ స్ఫూర్తి అని చెప్పి.. చిరు మీద తన అభిమానాన్ని చాటుకున్నారు సూర్య..

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Hyderabad: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో దారుణం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *