Suriya: తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం తన కొత్త చిత్రం ‘కంగువా’ ప్రచారంలో బిజీగా ఉన్నాడు. పాన్ఇండియా సినిమాగా రాబోతున్న ‘కంగువా’ సినిమాకు సంబంధించి ఇటీవల ఢిల్లీలో భారీ ఈవెంట్ లో పాల్గొన్నాడు. ఇదిలా ఉంటే సూర్య నటించిన 44వ మూవీ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది. ఆ తర్వాత ఆర్.జె బాలాజీ దర్శకత్వంలో తన 45వ సినిమా చేయబోతున్నాడు సూర్య. ఫాంటసీ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఇందులో ఇప్పటికే రుక్మిణి వసంత్ ని ఓ కథానాయికగా ఎంచుకోగా ఇప్పడు హీరోయిన్ గా మృణాల్ ఠాగూర్ ని మరో హీరోయిన్ గా ఎంపిక చేశారట. ఈ సినిమాకు ఎ.ఆర్. రెహ్మాన్ సంగీతం అందించనుండటం విశేషం. ఇక నవంబర్ 14న రిలీజ్ కాబోతున్న ‘కంగువా’ నుంచి రెండో పాటను రిలీజ్ చేశారు. ‘యోలో’ అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటోంది. మరి రాబోయే సినిమాలతో సూర్య ఏ స్థాయిలో ఆకట్టుకుంటాడో చూడాలి.
