Khushi Kapoor

Khushi Kapoor: అందం కోసం శస్త్రచికిత్స.. షాకిస్తున్న ఖుషీ కపూర్ బోల్డ్ కామెంట్స్!

Khushi Kapoor: సినీ పరిశ్రమలో అందం ఒక ఆయుధం. గతంలో శ్రీదేవి నుంచి నేటి తరం హీరోయిన్ల వరకూ చాలా మంది తమ అందాన్ని మెరుగుపరుచుకునేందుకు శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. ఇప్పుడు శ్రీదేవి నటవారసురాలు ఖుషీ కపూర్ కూడా ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడి ఆకర్షిస్తోంది. తాను అందం కోసం సర్జరీలు చేయించుకున్నానని ఖుషీ నిజాయితీగా ఒప్పుకుంది. “నేను ఏం చేశానో బహిరంగంగా చెబుతా. ఇందులో తప్పేమీ లేదు. ఎవరైనా తమకు నచ్చినది చేసుకోవచ్చు,” అని ఆమె అన్నారు. అందం గురించి అవాస్తవ ఆలోచనలు యువతను కలవరపెడతాయని, అందుకే నిజం చెప్పడం ముఖ్యమని ఖుషీ పేర్కొంది. అయితే, ఈ సర్జరీలు ఎల్లప్పుడూ సురక్షితం కావు. ఇటీవల నటి షెఫాలి జరివాలా మరణం ఈ ప్రమాదాలను గుర్తు చేసింది. అందం కోసం రిస్క్ తీసుకోవడం ఎంతవరకు సమంజసం? అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *