Suresh Raina: టీమిండియా మాజీ స్టార్ ప్లేయర్ సురేష్ రైనా… భారత ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ పైన ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుత యువ స్టార్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ ను ఛాంపియన్స్ ట్రోఫీకు సెలెక్ట్ చేసిన నిర్ణయం పైన రైనా స్పందిస్తూ… కెప్టెన్ మరియు సెలెక్టర్ల నిర్ణయాన్ని కొనియాడాడు. మరి ఈ మధ్యకాలంలో అద్భుతమైన ఫ కనబరుస్తున్నా జైస్వాల్ ను ఒక ఐసీసీ టోర్నమెంట్ జట్టులోకి తీసుకున్నంత మాత్రాన… ఇన్ని ప్రశంసలు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అయితే.. పూర్తి వివరాల్లోకి వెళ్దాం..!!
పాకిస్తాన్ మరియు దుబాయ్ లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనబోయే భారత జట్టులో యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ చోటు సంపాదించాడు. ఈ మధ్యకాలంలో ప్రత్యర్థి, దేశం, బౌలింగ్ అటాక్ లతో సంబంధం లేకుండా ఎక్కడైనా చెల్లరేగిపోయి అత్యద్భుత పర్ఫార్మెన్స్ ఇస్తున్న జైస్వాల్… ఈ టోర్నమెంట్ కు జాతీయ జట్టులో చోటు సంపాదించడం, సురేష్ రైనా ను ఎంతో మెప్పించింది. ముఖ్యంగా భారత సెలెక్టర్లు, కెప్టెన్ రోహిత్ శర్మ పైన అతను ప్రశంసల జల్లు కురిపించాడు.
అయితే విషయం ఏమిటంటే… ఈ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టుని ప్రకటించే సమయానికి జైస్వాల్ ఒక్క వన్డే మ్యాచ్ కూడా ఆడలేదు.మరి కొద్ది రోజుల్లో మొదలు కాబోయే ఇంగ్లాండ్ తో జరిగే వన్డే సిరీస్ తోనే అతను భారత జట్టులోకి 50 ఓవర్ల ఫార్మాట్ లో అరంగేట్రం చేయనున్నాడు. ఒక ప్లేయర్ ఆ ఫార్మాట్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే అతని ఒక ఐసీసీ అంతర్జాతీయ ట్రోఫీకి జట్టులోకి తీసుకోవడం చిన్న విషయం కాదు. అందుకే రైనా రోహిత్ శర్మ ను ఈ నిర్ణయం గురించి పొగిడాడు.
ఇది కూడా చదవండి: Sunil Gavaskar: కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు..! మరి బీసీసీఐ ఏం చేస్తుందో…?
Suresh Raina: యశస్వి జైస్వాల్ లో కచ్చితంగా టాలెంట్, పట్టుదల మెండుగా ఉన్నాయి అని… అలాగే ఎటువంటి ప్రతికూల పరిస్థితులను అయినా అధిగమించే మానసిక ధైర్యం అతని సొంతం అని చెప్పిన రైనా… భారత క్రికెట్ లోని గొప్పతనం ఏమిటంటే… మీకు అత్యుత్తమ స్థాయిలో రాణించాలి అన్న కసి, అందుకు కావలసిన ప్రయత్నం టాలెంట్ కూడా ఉంటే కచ్చితంగా అలాంటి వారికి సెలెక్టర్లు, కెప్టెన్ ఎప్పుడూ వెన్నుదన్నుగా నిలుస్తారు అంటూ ఈ మాజీ ఛాంపియన్స్ ట్రోఫీ విన్నర్ ప్రశంసల వర్షం కురిపించాడు.
ఇక చాంపియన్స్ ట్రోఫీ విషయానికి వస్తే… యశస్వి ఖచ్చితంగా చోటు సంపాదిస్తాడు అనేది ఖాయం కాలేదు. ఎందుకంటే ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభమన్ గిల్ ఆడుతారు. ఆ తర్వాత కోహ్లీ, రాహుల్, శ్రేయస్ అయ్యర్ తమ తమ స్థానాలలో కొనసాగుతారు. మిడిల్ ఆర్డర్ లో జైస్వాల్ ఆడే అవకాశాలు తక్కువ కాబట్టి అతను ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ లో వెంటనే ఆడేందుకు అవకాశాలు కనిపించడం లేదు కానీ ఇంగ్లాండ్ తో జరుగబోయే సిరీస్ లో అతను ప్రస్తుతం ఉన్న ఫామ్ కొనసాగిస్తే… గిల్ స్థానానికి తీవ్ర పోటీ నెలకొంటుంది. మరి యశస్వి జైస్వాల్ ఇంగ్లాండ్ సిరీస్ లో రాణించి ఛాంపియర్ ట్రోఫీలో నేరుగా తుదిచెట్టులోకి వస్తాడా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

