Supreme Court

Supreme Court: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఎమ్మెల్సీ కోదండరాం, అలీఖాన్ నియామకం రద్దు

Supreme Court: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గవర్నర్ కోటా కింద ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్‌ను ఎమ్మెల్సీలుగా నియమించారు. అయితే, ఈ నియామకాలను సవాలు చేస్తూ బీఆర్‌ఎస్‌ నేతలు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు
2024 ఆగస్టు 14న సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది కపిల్ సిబల్, కొత్తగా ఎమ్మెల్సీలను నియమించకుండా స్టేటస్ కో విధించాలని కోరగా, “గవర్నర్ నామినేట్ చేయడాన్ని అడ్డుకోలేము” అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎమ్మెల్సీల నియామకం ప్రభుత్వ విధి అని కూడా కోర్టు పేర్కొంది.

కోదండరాం, అలీఖాన్ నియామకం రద్దు
బీఆర్‌ఎస్ నేతల పిటిషన్‌లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమితులైన కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకాలను రద్దు చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ప్రభుత్వం లేదా గవర్నర్ తీసుకునే చర్యలు సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసులో తదుపరి విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *