Supreme Court: కంచె గచ్చిబౌలి భూముల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అక్కడి చెట్ల నరికివేతపై సమాధానం చెప్పాలని నిలదీసింది. పర్యవరణాన్ని పునరుద్ధరించాల్సిందేనని, లేకుంటే అధికారులు జైలుకు వెళ్లాల్సిందేనని స్పష్టం చేసింది. చెట్ల నరికివేతన సమర్థించుకోవద్దంటూ హెచ్చరించింది.
Supreme Court: కంచె గచ్చిబౌలి భూములకేసును సుప్రీంకోర్టు మరోసారి విచారించింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం గతంలో చెప్పిన విషయాలనే మళ్లీ చెప్పడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆయా విషయాలపై మరోసారి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఘాటుగా స్పందించింది.
Supreme Court: వేలాది చెట్లను అక్రమంగా కొట్టేశారని సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్రంగా మందలించింది. ఆ చెట్లనన్నింటినీ పునరుద్ధరించాల్సిందేనని స్పష్టం చేసింది. ఇష్టానుసారగంగ డబన్ల కొద్దీ బుల్డోజర్లను పెట్టి చెట్లను నరికేశారని ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇదంతా ముందస్తు ప్రణాళిక ప్రకారమే చేసినట్టు అర్థమవుతుందని నిర్ధారణకు వచ్చింది. తదుపరి విచారణను జూలై 23వ తేదీకి వాయిదా వేస్తూ సుప్రీం ధర్మాసనం ఆదేశాలిచ్చింది.