Supreme court

Supreme Court: సుప్రీంకోర్టు ఆగ్రహం.. కేఏ పాల్‌ పిటిషన్‌పై ఘాటు వ్యాఖ్యలు!

Supreme Court: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన ఒక పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం విధానంలో నిర్వహించాలనే ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ వేశారు.

జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. మీడియాలో ప్రచారం పొందడం కోసమే కేఏ పాల్ ఇలాంటి పిటిషన్లు దాఖలు చేస్తున్నారని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇలాంటి విషయాల కోసం నేరుగా సుప్రీంకోర్టుకు రాకుండా, ముందుగా దీనిపై హైకోర్టును ఆశ్రయించాలని కేఏ పాల్‌కు స్పష్టం చేసింది. దాంతో, సుప్రీంకోర్టులో కేఏ పాల్ పిటిషన్‌కు ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *