Tirumala Laddu Issue

Tirumala laddu Issue: లడ్డూ వ్యవహారంలో సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం.. ఏం చెప్పిందంటే..

లడ్డూ వ్యవహారాల్లో సుప్రీం తన నిర్ణయాన్ని ప్రకటించింది .   తిరుమల లడ్డూ కల్తీపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది .  ఇప్పటికే సిట్ దర్యాప్తు జరుగుతుండగా . . దానిని పక్కన పెట్టి . . ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీం నిర్ణయించింది. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్‌ సూద్ పర్యవేక్షణలో విచారణ జరుగుతుందని చెప్పింది కోర్టు.  ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది .   .  ఈ కమిటీలో సీబీఐ నుంచి ఇద్దరు, ఏపీ సిట్ నుంచి ఇద్దరు అధికారులు.. FSSAI నుంచి సీనియర్ ఫుడ్ సేఫ్టీ అధికారి కమిటీలో సభ్యులుగా ఉంటారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది .   అంతేకాదు . . మరో సంచలనం ఏమిటంటే.. ఈ కమిటీ నివేదిక వచ్చేవరకూ సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్‌లోనే ఉంటుందని ధర్మాసనం చెప్పింది.

లడ్డూ విషయంలో రాజకీయంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయవద్దని సుప్రీం కోర్టు ఆదేశించింది. తీర్పు సందర్భంగా కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది .  భక్తుల మనోభావాలకు భరోసా కల్పించడం కోసమే..
స్వతంత్ర దర్యాప్తు కమిటీ వేస్తున్నట్టు  జస్టిస్ బీఆర్ గవాయ్ చెప్పారు. అలాగే ,  కోర్టులను రాజకీయ వేదికలుగా వినియోగించవద్దంటూ కోర్టు సూచించింది .  ఇది కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశం అనీ . . దీనిని పొలిటికల్ డ్రామాగా మార్చొద్దని చురకలు వేసింది సుప్రీం ధర్మాసనం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *