supreme court

Supreme Court: బుల్‌డోజర్‌ చర్యలపై కోర్టు సీరియస్.. ఇళ్లను కూల్చడం అరాచకం..

Supreme Court: బుల్‌డోజర్‌ చర్యలపై యూపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు బుధవారం మందలించింది. ఇది ఏకపక్షం అని కోర్టు పేర్కొంది. మీరు బుల్‌డోజర్‌తో రాత్రిపూట ఇంటిని పడగొట్టలేరు. మీరు ఇంటిని ఖాళీ చేయడానికి కుటుంబానికి సమయం ఇవ్వాలి. అంతేకాకుండా, గృహోపకరణాల గురించి, సరైన విధానాన్ని అనుసరించాలి అంటూ కోర్టు పేర్కొంది. 

ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ దీనిపై మాట్లాడుతూ.. ‘మీరు ఇష్టం వచ్చినట్టు ప్రజల ఇళ్లను కూల్చివేయడం ఎలా ప్రారంభిస్తారు. ఎవరి  ఇంటినైనా నోటీసు లేకుండా కూల్చివేయడం అరాచకం. అన్నారు. ‘మీరు డప్పు కొట్టి ఇళ్లను ఖాళీ చేయమని, కూల్చివేయమని ప్రజలను అడగలేరు’ అని సుప్రీంకోర్టు తీవ్రంగా అభ్యంతరం తెలిపింది.  2019 కేసులో 25 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని యూపీ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది.

ఇది కూడా చదవండి: Supreme Court: ప్రభుత్వ ఉద్యోగులపై మనీలాండరింగ్ కేసులు.. అధికారుల అనుమతి తప్పనిసరి

2019లో మహారాజ్‌గంజ్ జిల్లాలో రహదారి విస్తరణ కోసం చాలా ఇళ్లను అక్కడి ప్రభుత్వ అధికారులు కూల్చివేశారు. దీనిపై విచారణ జరిపించాలని పిటిషనర్‌ తరపు న్యాయవాది డిమాండ్‌ చేశారు. ఈ వ్యవహారంపై చీఫ్ సెక్రటరీ విచారణ జరిపించాలని కూడా కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. అసలు రోడ్డు వెడల్పు, అదేవిధంగా ఆక్రమణకు సంబంధించి NHAI ఎటువంటి పత్రాలను అందించలేదని పిటిషనర్ తరఫు లాయర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీంతో కోర్టు స్పందించి పిటిషనర్ కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Mahashivratri 2025: మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉంటున్నారా ? ఇలా చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *