Rahul Gandhi: కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు కఠినంగా స్పందించింది. భారత సైన్యం గురించి రాహుల్ చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం కేసు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఆ కేసును రద్దు చేయాలని రాహుల్ గాంధీ వేసిన పిటిషన్‌ను విచారిస్తున్న ధర్మాసనం ఆయన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
రాహుల్ వ్యాఖ్యలు ఏంటి..?
2023లో భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ – “చైనా భారత్ భూభాగంలో 2000 కి.మీ ఆక్రమించుకుంది. ఈ విషయం ఒక ఆర్మీ ఆఫీసర్ చెప్పాడు” అని వ్యాఖ్యానించారు. 2020 జూన్‌లో గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణ తర్వాత ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
కోర్టు ఏమంది..?
ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తగా, ప్రస్తుతం సుప్రీంకోర్టులో క్రిమినల్ పరువు నష్టం కేసు కొనసాగుతోంది. దీనిపై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఏజీ మాసిహ్‌ల ధర్మాసనం స్పష్టంగా స్పందించింది:
-
“చైనా 2000 కి.మీ భూమిని ఆక్రమించిందని మీకు ఎలా తెలుసు?”
-
“ఇలాంటి మాటలు నిజమైన భారతీయులు మాట్లాడరని” మండిపడింది.
-
“ఈ రకమైన మాటలు సమాజాన్ని తప్పుదోవ పట్టించొచ్చు” అని హెచ్చరించింది.
ఇది కూడా చదవండి: Raj Gopal Reddy: తెలంగాణ సమాజం సహించదు.. రేవంత్ రెడ్డికి ఇచ్చిపడేసిన MLA
పార్లమెంట్‌లో మాట్లాడకుండా సోషల్ మీడియాలో ఎందుకు..?
రాహుల్ తరఫున హాజరైన న్యాయవాది అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ – “ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు ఈ విషయాలు చెప్పాల్సిన బాధ్యత ఉంది” అన్నారు. దీనికి న్యాయస్థానం కౌంటర్‌గా – “అలా అయితే ఈ అంశాల్ని పార్లమెంటులో ఎందుకు లేవనెత్తలేదు..? సోషల్ మీడియాలో ఎందుకు చెబుతున్నారు..?” అని ప్రశ్నించింది.
ముందు ఏమౌతుంది..?
సుప్రీంకోర్టు ఈ కేసులో తుది తీర్పు ఇవ్వకపోయినా, రాహుల్ గాంధీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
