Supreme Court Of India:నీట్ కౌన్సిలింగ్, మెడికల్ సీట్ల అడ్మిషన్ల వ్యవహారంలో స్థానిక అంశానికి సంబంధించి సరైన పరిష్కారంతో రావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. లేదంటే ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది.
Supreme Court Of India:మెడికల్ సీట్ల అడ్మిషన్లకు సంబంధించి నీట్‌కు ముందు నాలుగేళ్లు స్థానికంగా చదివి ఉండాలన్న నిబంధనతో గతంలో జీవో 33ను తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనిని వ్యతిరేకిస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు నిరుడు సెప్టెంబర్ 5న విద్యార్థులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ అదే నెల 11న సుప్రీంకోర్టులో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేసింది.
Supreme Court Of India:ఈ స్పెషల్ లీవ్ పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని జస్టిస్ కే వినోద్ చంద్రన్, జస్టిస్ జోమలయ బగ్చీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ప్రతివాదుల తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ తెలంగాణలో పుట్టి పదో తరగతి వరకు చదివినా స్థానిక కోటా దక్కడం లేదని, 11, 12 తరగతులను చదవని కారణంగా నీట్‌లో స్థానిక కోటా దక్కక నష్టపోతున్నట్టు కోర్టుకు న్యాయవాదులు నివేదించారు.
Supreme Court Of India:పలు సందర్భాల్లో కేంద్ర పారామిలిటరీ, ఇతర ఉద్యోగాల రీత్య తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాల్లో పనిచేయాల్సి వస్తున్నదని, అలాంటి వారి పిల్లలు ఈ నిబంధనతో అవకాశాలను కోల్పోతున్నారని న్యాయవాదులు తమ వాదనను వినిపించారు. సుదీర్ఘ వాదనలు విన్న త్రిసభ్య ధర్మాసనం పై విధంగా ఆదేశాలను జారీ చేసింది.