Supreme Court Of India: తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ దంపతులు, దివంగత గట్టు వామనరావు దంపతుల హత్య కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు సీబీఐకి అప్పగించేందుకు అభ్యంతరం ఏమీ లేదని తెలంగాణ ప్రభుత్వ తరఫు న్యాయవాది న్యాయస్థానానికి తెలిపారు. ఈ మేరకు ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు సుప్రీంకోర్టు మంగళవారం (ఆగస్టు 12) ఆదేశాలు జారీచేసింది.
Supreme Court Of India: అడ్వకేట్ దంపతులు వామన్‌రావు ఆయన భార్య నాగమణి 2021 ఫిబ్రవరి 17న దారుణ హత్యకు గురయ్యారు. కారులో వెళ్తున్న వారిద్దరినీ పెద్దపల్లి జిల్లా కాల్వచర్ల సమీపంలో దుండగులు అడ్డుకొని కత్తులతో దాడి చేయగా, ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసు విషయంలో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
Supreme Court Of India: వామన్‌రావు, నాగమణి దంపతుల హత్యకేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని వామన్‌రావు తండ్రి కిషన్‌రావు హైకోర్టులో గతంలోనే పిటిషన్ వేశారు. మంథని పోలీస్‌స్టేషన్‌లో ఓ కస్టోడియల్ డెత్ సహా పలు అంశాలపై హైకోర్టులో వామన్‌రావు పిల్స్ దాఖలు చేశారు. వాటిపై కొందరు పోలీసులు తనను బెదిరిస్తున్నారని 2020లో వామన్‌రావు హైకోర్టుకు లేఖ కూడా రాశారు.