Supreme Court Of India: తెలంగాణలో 10 ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. ఇప్పటికే వాదోప వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం ఈ తీర్పును వెలువరించింది. ఈ కేసు తుది తీర్పుపై ఇటు తెలంగాణ రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా కూడా ఉత్కంఠ నెలకొన్నది. సుప్రీంకోర్టు ధర్మాసనం ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్న అంశంపై అంతటా ఆసక్తి నెలకొన్నది.
Supreme Court Of India: బీఆర్ఎస్ పార్టీలో గెలుపొందిన తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, వివేకానంద, పాడి కౌశిక్‌రెడ్డి వేర్వేరుగా పిటిషన్లను దాఖలు చేశారు. గురువారం ఈ కేసును సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది. తుది తీర్పుపై కీలక వ్యాఖ్యలు చేసింది.
Supreme Court Of India: పార్టీ ఫిరాయించిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా తెలంగాణ శాసనసభ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకుంటే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్టు అవుతుందని పేర్కొన్నది. అందుకే తగు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు గడువు ఇచ్చినట్టు సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొన్నది.
ఆ 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్‌పై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లను పెండింగ్‌లో ఉంచడం సరికాదని పేర్కొన్నారు. 3 నెలల తర్వాత విచారణను పొడిగించడానికి ఆ ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తే, స్పీకర్ ప్రతికూల నిర్ణయం తీసుకోవచ్చని వ్యాఖ్యానించారు.