Supreme Court Of India: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్‌పై గురువారం (జూలై 31) సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వనున్నది. తెలంగాణ రాజకీయాల్లో ఈ తీర్పు రాజకీయ ప్రకంపనలకు దారితీసే అవకాశం ఉన్నది. దీనిపై అటు కాంగ్రెస్ పార్టీలో, ఇటు బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉన్నది.
Supreme Court Of India: బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అయిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికెపూడి గాంధీ, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, డాక్టర్ సంజయ్, ప్రకాశ్‌గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. సరైన న్యాయం జరగలేదని బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్లింది.
Supreme Court Of India: బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై పైవారంతా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారందరిపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అయిన కేపీ వివేకానందగౌడ్, పాడి కౌశిక్‌రెడ్డి వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన రిట్ పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం తుది తీర్పును ఇవ్వనున్నది.
Supreme Court Of India: ఉదయం 10.45 గంటలకల్లా తుది తీర్పు వస్తుందని అందరూ భావిస్తున్నారు. అయితే రెండు విషయాలపై తీవ్ర చర్చ జరుగుతున్నది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా తీర్పునిస్తుందా? లేక తగు నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌కు ఆదేశాలను జారీ చేస్తుందా? అన్న అంశాలపై ఒకటే చర్చ జరుగుతున్నది. ఈ కేసులోనే స్పీకర్, న్యాయస్థానాల జోక్యంపై ఉన్న అంశం కూడా తేలిపోతుందని భావిస్తున్నారు.