Supreme Court Of India: వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ ఇప్పించడంపై నిర్లక్ష్యం వహించిన అటు కేంద్ర ప్రభుత్వంపై, ఇటు వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. వీధి కుక్కల దాడులతో రేబిస్, ఇతర వ్యాధులు సోకి ఎంతో మంది చనిపోతున్నారన్న వార్తలను రోజూ వినాల్సి వస్తున్నా, మీలో చలనం లేదా అంటూ సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం అసహనం వ్యక్తంచేసింది.
Supreme Court Of India: వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ చర్యలు చేపట్టాలని ఆదేశిస్తూ గత ఆగస్టు 22న ఉత్తర్వులిస్తే ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయలేదని కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తంచేసింది. ఇప్పటి వరకూ స్పందించని ఆయా రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలందరూ తదుపరి విచారణలో తమ ముందు హాజరు కావాలని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది.
Supreme Court Of India: వీధి కుక్కల బెడదపై గత ఆగస్టులోనే సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. కరిచే కుక్కలను, రేబిస్ ఉన్న కుక్కలను షెల్టర్లలో ఉంచాలని, వీధి కుక్కలకు బహిరంగ ప్రదేశాల్లో ఆహారం పెట్టకూడదని, వీధి కుక్కలకు టీకాలు వేసిన తర్వాత మాత్రమే వదిలేయాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది. ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వమూ స్పందించకపోవడంపై తాజాగా ఆగ్రహం వ్యక్తంచేసింది.

